twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మర్డర్లు, మానభంగాలు జరగలేదే.. కొత్త పార్టీ అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

    |

    అత్యంత వివాదాస్పద శైలిలో, తీవ్ర ఉద్రిక్తతల మధ్య మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటుచేసుకొన్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత దూషణలు, దాడులకు కూడా వెనుకాడని పరిస్థితులు కనిపించాయి. అయితే అనేక పరిణామాల మధ్య ఓటిం్ పూర్తయింది. అయితే తన ఓటు వినియోగించుకొన్న తర్వాత యూనియన్ ఏర్పాటు కావొచ్చు అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఓటు వినియోగించుకొన్న తర్వాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..

    ఎన్నికలంటే గొడవలు సాధారణం

    ఎన్నికలంటే గొడవలు సాధారణం

    ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలంటేనే గొడవలు సాధారణం. మా ఎన్నికల్లో కూడా గొడవల జరగడం తప్పేమి లేదు. మర్డర్లు, మానభంగాలు జరగలేవు కదా, సంతోషంగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరుగుతున్నది. ఓటు ఎవరికి వేశాననే విషయం నేనుచెప్పలేను. నేను ఎవరికి ఓటు వేస్తే వారు గెలిస్తారు అని బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు.

    నేను ఓటు వేసిన వాడు గెలుస్తాడు అంటూ

    నేను ఓటు వేసిన వాడు గెలుస్తాడు అంటూ

    మీడియా పదే పదే ఎవరు గెలుస్తారు అని అడిగితే.. పోటీ చేసిన 25 మందిలో 25 మంది గెలుస్తారు. ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. ప్రసిడెంట్, వైస్ ప్రసిడెంట్‌గా ఒకరి గెలుస్తారు. నేను ఓటు వేసినోడు తప్పకుండా గెలుస్తాడు అని బండ్ల గణేష్ సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు తాను పోటీలో నుంచి తప్పుకొంటానని బండ్ల గణేష్ ప్రకటించడం సంచలనంగా మారింది.

    నా నిర్ణయం సరైనదే అంటూ

    నా నిర్ణయం సరైనదే అంటూ


    నేను ఓటు వేసిన వారే గెలుస్తారు అని బండ్ల గణేష్ సెటైర్ వేశారు. మా ఎన్నికల్లో పోటీని తప్పుకోవడం నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకొన్నాను. నేను తీసుకొన్న నిర్ణయం మంచిదే. ఎవరైతే హామీలు చేశారో.. వారందరిని హామీలు పూర్తి చేసేలా పోరాటం చేస్తాను అని బండ్ల గణేష్ అన్నారు.

    కొత్త పార్టీలు వస్తున్నాయి.. ఏదైనా జరుగొచ్చు అంటూ

    కొత్త పార్టీలు వస్తున్నాయి.. ఏదైనా జరుగొచ్చు అంటూ

    నేను ట్వీట్లు చేస్తూ జర్నలిస్టు వృత్తికి న్యాయం చేయడమే కాకుండా వినోదాన్ని కూడా అందిస్తాను. డబుల్ బెడ్రూం ఇళ్ల హమీ గురించి నేనేమి చెప్పను. భవిష్యత్‌లో అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. ఈ రెండు ప్యానెల్స్‌ను వదిలేసి.. మరో కొత్త ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారా? లేక కొత్త యూనియన్ ప్రారంభిస్తారా అంటే. కొత్త పార్టీలు ఎన్ని రాలేదు.. రేపు ఏమైనా జరుగవచ్చు అంటూ కామెంట్ చేశారు.

    Recommended Video

    Bigg Boss Telugu 5: Hamida కోసం విశ్వ ఎలిమినేట్ ? ఆమెకు తక్కువ ఓట్లు.. కానీ ! || Oneindia Telugu
    మా ఎన్నికల్లు పోలైన ఓట్ల సంఖ్య ఇదే..

    మా ఎన్నికల్లు పోలైన ఓట్ల సంఖ్య ఇదే..

    ఇదిలా ఉండగా, మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. మొత్తం 905 మంది సభ్యులు ఉండగా, అందులో 883 మంది చెల్లుబాటు అయ్యే ఓటర్లు ఉన్నారు. అందులో 605 మంది ఓట్లు వేయగా, 60 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. ఓట్ల లెక్కింపు 4 గంటల ప్రాంతంలో మొదలైంది. రాత్రి 9.30 తర్వాత ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యే అవకాశం ఉంది. చివరిగా ప్రసిడెంట్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని పోలింగ్ అధికారులు తెలిపారు.

    English summary
    MAA Elections voting is going at Hyderabad with tensious moment. In this occassion, Bandla Ganesh sensational comments on MAA Elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X