»   » చిరు లేని తెలుగు సినిమానా? బండ్ల కౌంటర్ ఎవరిపై?

చిరు లేని తెలుగు సినిమానా? బండ్ల కౌంటర్ ఎవరిపై?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాత బండ్ల గణేష్ ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు రీసెంటుగా జరిగిన ఆడియో వేడుకలో ఓ సీనియర్ దర్శకుడు చేసి వ్యాఖ్యలకు కౌంటర్ అని అంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

‘రాముడు లేని రామాయణం చదవం చిరంజీవి పేరు లేని తెలుగు సినిమా గురించి మాట్లాడలేం. సంవత్సరాలు గడిచినా గుణం మారని దృవనక్షత్రం మెగా స్టార్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ గార్ల తరువాత స్వయం కృషితో నెంబర్ 1 స్థానాన్ని అదిరోహించి మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమను ఏలిన మకుటం లేని మహారాజు అని, తెలుగు క్యాలెండర్‌లో పండగలు ఉంటే తెలుగు సినీపరిశ్రమ కాలెండర్‌లో చిరంజీవిగారి సినిమా రిలీజ్ డేట్లు ఉంటాయి' అంటూ ట్విట్ చేసాడు.

 Bandla Ganesh tweets in talk

డ్యాన్సు నేర్చుకోవాలంటే, ఫైట్స్ ప్రాక్టీస్ చేయాలంటే అంతెందుకు చివరిచి నడవాలంటే, నిలబడాలంటే కూడా మెగాస్టార్ నుండి నేర్చుకున్నవే. చిరంజీవిలా కష్టపడి పైకి రా అని కొడుకుతో అంటాం. కష్టపడి పైకొస్తాం అంటూ చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే యువత అనేకం. సైకిల్ స్టాండ్ ఎంప్లాయి నుంచి నెంబర్‌వన్ ప్రొడ్యూసర్ దాకా ఎదురుచూసేది చిరంజీవి సినిమా కోసమే. పేటకు ఆయనే మేస్త్రి. కొడితే ఆయనే సిక్సు కొట్టాలి. ఆయనకి అభిమానం పంచిన తమ్ముళ్ళం మనం, మెగాస్టార్ జిందాబాద్ అంటూ ట్వీట్ చేసారు.

English summary
Today, Bandla Ganesh tweeted numerous affectionate words on Megastar Chiranjeevi. Tweeting in Telugu, he compared the hard-work and lonely battle of Chiranjeevi with the legends like NTR, ANR and Krishna and said that Chiru rules TFI for more than 3 decades. Ganesh further said that if a Telugu calendar has a list of festivals, the Tollywood has the list of Chiranjeevi's films.
Please Wait while comments are loading...