twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉండేవి.. సీసీసీపై బెనర్జీ కామెంట్స్

    |

    కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కోటి రూపాయల విరాళంతో ప్రారంభించిన చిరంజీవి.. తన తోటీ నటీనటీలను ముందుకు రావాలని పిలుపునిచ్చాడు. చిరు పిలుపుతో టాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. దాదాపు 8 కోట్ల మేర విరాళాలను సేకరించాడు. ఈ ఛారిటీకి కొంతమంది సభ్యులను కేటాయించి.. నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. ఇప్పటికే మొదటి విడత నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. ఈ మధ్యే రెండో విడతను ప్రారంభించారు.

    రెండో విడతలో భాగంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ మా బృందం మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో మా అధ్యక్షుడు బెనర్జీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ కంటే ఆకలి చావులు ఎక్కువగా ఉండేవని, సీసీసీ వల్లే ఎంతో మంది రోడ్డు మీద పడకుండా ఇంట్లో ఉంది తిన గలుగుతున్నారని, చిరంజీవి,హీరోలకు అందరికీ ధన్యవాదాలని తెలిపాడు. మా సభ్యురాలు నటి హేమ మాట్లాడుతూ.. సినీ నటులు, కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. సీసీసీకి సాయం చేసేందుకు బాలకృష్ణతో పాటు పలువురు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ముందుకు వచ్చారని అందరికి ధన్యవాదాలు చెపుతున్నామని అన్నారు.

    Banerjee and Hema In CCC Distribution Of Groceries

    రెండో విడతలో భాగంగా నిత్యావసరాలు కొందరికే పంపిణీ చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ కార్మికులు ఇందిరానగర్‌ ప్రాంతంలోని కార్యాలయాల వద్ద బుధవారం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమస్యను చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలుగు సినీటీవీ ప్రొడక్షన్‌ అసిస్టెంట్స్‌ యూనియన్, తెలుగు లైట్‌మెన్‌ యూనియన్, తెలుగు సినీ స్టూడియోవర్కర్స్‌ యూనియన్లు హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.

    English summary
    Banerjee and Hema In CCC Distribution Of Groceries. CCC Distribution Of Groceries Created Row In Tollywood. second Phase Of Distribution Of Groceries Going Onwords.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X