twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వ విఖ్యాత దర్శక మహర్షి'గా బాపు

    By Srikanya
    |

    విశాఖపట్నం : ప్రఖ్యాత తెలుగు చలనచిత్ర దర్శకుడు బాపు అరుదైన బిరుదుకు ఎంపికయ్యారు. విశాఖలోని సాగరతీరంలో ఆదివారం రాత్రి టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్‌ ఆయనకు 'విశ్వ విఖ్యాత దర్శక మహర్షి' బిరుదును ప్రదానం చేసింది. మహాశివరాత్రి 28వ మహాకుంబాభిషేకం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాపు తరపున ఆయన కుమారుడు వెంకటరమణ పురస్కారాన్ని స్వీకరించారు. అస్వస్థత కారణంగా బాపు రాలేకపోయారని సుబ్బరామిరెడ్డి ప్రకటించారు.

    ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ... తెలుగు చిత్ర పరిశ్రమకు విశ్వనాథ్, బాపు రెండు కళ్లవంటి వారని అన్నారు. టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ ఆర్‌కే బీచ్‌లో సినీ దర్శకుడు డాక్టర్ బాపుకి 'విశ్వవిఖ్యాత దర్శక మహర్షి' బిరుదును ప్రదానం చేశారు.

    కె. విశ్వనాథ్ మాట్లాడుతూ గీతలతో తెలుగు సంప్రదాయాన్ని అందంగా చూపించగలిగిన చిత్రకారుడు బాపు అన్నారు. చిత్రకారుడుగా ఎన్ని అద్భుతాల్ని సృష్టించారో అంతకు మించిన అద్భుతాల్ని తన సినిమాలలో చూపించారన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ బాపు చిత్రాలు తెలుగు చలనచిత్రాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాయని అన్నారు

    విశాఖ వంటి నగరంలో సుబ్బిరామిరెడ్డి వంటి ప్రముఖుడు తనకు బిరుదు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. స్వయంగా వచ్చి సత్కార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నం దుకు బాపు తన విచారాన్ని ఆ లేఖలో వెలుబుచ్చారు. ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, నటి వాణిశ్రీ, పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబూరావు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    చిత్రకారుడు అయిన బాపు 1967 నుంచి సినిమాలకు దర్శకత్వం మొదలు పెట్టారు. ఆయన తెలుగులో 'సాక్షి' అనే సినిమాను తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో తీసారు. ఆయన దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు, బాలరాజు కథ, అందాల రాముడు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, శ్రీరామ రాజ్యం చిత్రాలు పలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి.

    English summary
    Veteran Telugu director Bapu a.k.a Sattiraju Laxmi Narayanawas conferred the "Vishwa Vikyata Dharshaka Maharishi" award by industrialist-politician T. Subbarami Reddy (TSR).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X