»   »  ఫిల్మ్ ఫన్: హిట్టే గాని...

ఫిల్మ్ ఫన్: హిట్టే గాని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ పెద్దాయన దర్శకుడు బాపు గారి దగ్గరికి వచ్చి ఫ్లాఫైన తన సినిమా గురించి ఇంత కాదు అంత అని గంటల తరబడి చెబుతున్నారుట. విని విని ఆయనకు విసుగెత్తి పోయిందిట. కాని మొహమాట పడి చెప్పలేకున్నారు. కాలం గడుస్తోంది...సహనం చచ్చిపోతోంది. ఏం చేయాలో అర్ధం కావటం లేదు. అవతలి పెద్దాయన మాత్రం అర్ధం చేసుకోకుండా రెచ్చిపోతున్నాడుట.

ఇంతలోకి బాపు గారి అదృష్టవశాత్తు వేరే వ్యక్తి ఆ గదిలోకి వచ్చారట. కానీ అక్కడున్న ఆయన్ని చూసి వచ్చినాయనా కూడా కంగారుపడ్డారుట. బయిటకు వెళ్ళటానికి ప్రిపేరయ్యాడుట. అప్పుడు బాపు గారు కలుగ చేసుకుని ఆ వచ్చిన వ్యక్తికి ఆ సోది క్యాండిట్ ని పరిచయం చేసి..."సూపర్ హిట్ సినిమా తీసారు...కాస్త జనం కాడా చూస్తే బాగుండును!" అన్నారట. అంతే అది విన్న ఆ పెద్దాయన మొహం మాడి పోయిందిట. కోపంగా లేచి బయిలు దేరి వెళ్ళి పోయారట.

ఇదంతా చదువుతూంటే మన వాళ్ళు ఫ్లాప్ సినిమాలకు ..విజయోత్సవ సభలు జరపటం గుర్తుకు వస్తోంది కదా...పాంపం ఆ పెద్దాయన బాపు గారి లాంటి కొందమంది పరిచయస్తులనే చావబాదుతారు. కాని చాలామంది దర్శక నిర్మాతలు టి.వి ల్లో ,సభల్లో పరిచయం లేని వాళ్ళకు కూడా తమ ఫ్లాపు సినిమా గొప్పతనం చెప్పి..చెప్పీ నరకం చూపిస్తూంటారు. అప్పుడు ఈ జోక్ గుర్తు చేసుకుంటే బ్రెయిన్ కి కొంత సేఫ్.

Read more about: bapu director bapu gari chitram
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X