»   » బసంతి: బ్రహ్మానందం కొడుకుతో రిస్క్ చేస్తున్నారా?

బసంతి: బ్రహ్మానందం కొడుకుతో రిస్క్ చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రహ్మానందం తనయుడు గౌతం హీరోగా ఇప్పటికే పలువురు నిర్మాతలు సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. గౌతం వరుస ప్లాపులు చూసి ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరూ రిస్క్ చేయదలుచుకోలేదు. నిర్మాతలు ఎవరూ దొకరని దిక్కులేని పరిస్థితిలో తానే నిర్మాతగా మారాడు దర్శకుడు చైతన్య దంతులూరి.

తొలి చిత్రం 'బాణం'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతన్య దంతులూరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో స్టార్ట్ కెమెరా పిక్చర్స్ పతాకంపై గౌతం హీరోగా 'బసంతి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలీషా బేగ్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ఈ సినిమా గురించి దర్శకుడు చైతన్య దంతులూరి మాట్లాడుతూ బాణం చిత్రానికి ముందే ఈ చిత్ర కథ సిద్ధం చేసుకున్నాను. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యం నుంచి ఈ చిత్ర కథ పుట్టింది. కళాశాలలో అడ్మిషన్ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. 'బసంతి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్'లో చదవి విద్యార్థుల కథే ఈ 'బసంతి'. నవంబర్ నెలలో ఆడియో విడుదల చేసి, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

ఈ చిత్రంలో గౌతం, అలీషా బేగ్, రణధీర్ గట్ల, నవీనా జాక్సన్, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, కెఎస్ఐ, ఆనంద్, ధనరాజ్, మణికిరణ్, భాను అవిర్నేని, దయ నటిస్తున్నారు. పాటలు : కృష్ణ చైతన్య, శ్రీమణి, నృత్యాలు: రఘు, ఆర్ట్ : రఘు కులకర్ణి, పబ్లిసిటీ డిజైనర్స్ : అనీల్, భాను, మాటలు : శ్రీకాంత్ నాయుడు, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ: అనీల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, కథ-కథనం-నిర్మాణం-దర్శకత్వం: చైతన్య దంతులూరి.

English summary

 Pallakilo Pellikoothuru fame Goutham is going to test his luck yet again as a hero with a new film. The young actor will be seen in the film ‘Basanthi’ and the movie is getting ready for a December release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu