»   » ఉగ్రవాదం నేపథ్యంలో బ్రహ్మానందం కొడుకు

ఉగ్రవాదం నేపథ్యంలో బ్రహ్మానందం కొడుకు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాణం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు చైతన్య దంతులూరి. ఆయన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బసంతి'. కళాశాల నేపథ్యంలో ఉగ్రవాద సమస్యను కథాంశంగా ఎంచుకున్న ఈ చిత్రంలో గౌతమ్‌ హీరోగా నటిస్తుండగా అలీషాబేగ్‌ హీరోయిన్ గా పరిచయమవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని బృందం వెల్లడించింది.

చైతన్య దంతులూరి మాట్లాడుతూ ''ఉగ్రవాదం సమస్యని నేపథ్యంగా ఎంచుకొని తెరకెక్కించిన సినిమా ఇది. బసంతి కళాశాలలో చదివే విద్యార్థిగా గౌతమ్‌ కనిపిస్తారు. బాణం చిత్రానికి ముందే ఈ బసంతి చిత్ర కథ సిద్ధమైంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో నుంచి పుట్టిందే ఈ బసంతి కథ. కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోగానే ప్రతి స్టూడెంట్‌కి ఒక గుర్తింపు వస్తుంది. అంతే కాదు కళాశాల బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అందుకే కళాశాల జీవితం ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాము. బసంతి కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్‌‌స అండ్‌ సైన్స్‌'లో చదివే విద్యార్థుల కథే ఈ బసంతి. అర్జున్‌గా గౌతమ్‌ విద్యార్థి పాత్రలో కనిపిస్తాడు.''అన్నారు.

Basanti, A love Story With Terrorism in its Backdrop

హీరో గౌతమ్‌ మాట్లాడుతూ ''ఓ మంచి కథ బసంతి. దర్శకుడు కథ చెబుతున్నపుడు ఎంతో ఆసక్తి కలగడంతో పాటు, ఉద్వేగా నికి లోనయ్యాను. నేను పోషిస్తున్న అర్జున్‌ పాత్ర నటుడిగా నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నా''అన్నారు.

నక్సలిజం సమస్యని... తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా 'బాణం' రూపంలో తెరకెక్కించారు దర్శకుడు చైతన్య దంతులూరి. ఇప్పుడు ఆయన దర్శకనిర్మాణంలో వస్తోన్న మరో చిత్రం 'బసంతి'. ఇందులో తీవ్రవాదాన్ని నేపథ్యంగా ఎంచుకున్నారు. గౌతమ్‌, అలీషాబేగ్‌ జంటగా నటించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రణధీర్‌ గట్ల, నవీనా జాక్సన్‌, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మణిశర్మ, కళ: రఘు కులకర్ణి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: అనీల్‌ బండారి, పి.కె.వర్మ.

English summary
Chaitanya Dantuluri had directed the film ‘Banam’ with the issue of Naxalism as the conflict between father and son in a very delicate manner. This time, he had taken the issue of terrorism with college in its backdrop as the subject for his latest film ‘Basanti’. Gautham played the role of a student in Basanti’s college. The story, movement, action scenes, dialogues, music, cinematography, artistes’ performances, everything would attract the audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu