»   » ఇంత సెక్సీ గానా...!? ఫొటో చూస్తే అదిరిపోతారు... అయినా ప్రియాంక రెండోస్థానమే (వీడియో)

ఇంత సెక్సీ గానా...!? ఫొటో చూస్తే అదిరిపోతారు... అయినా ప్రియాంక రెండోస్థానమే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ వెళ్లిపోయి అక్కడే మకాం వేసేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. క్వాంటికో సీరియల్ దెబ్బకి అమ్మడికి అక్కడ ఫుల్ క్రేజ్ వచ్చేసేయగా.. అదే ఊపులో హాలీవుడ్ మూవీ బేవాచ్ లో ఛాన్స్ కూడా పట్టేసింది. 'బేవాచ్‌' హాలీవుడ్‌ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తోన్న విషయం విదితమే. అయితే, ఈ సినిమాలో ఆమెది నెగెటివ్‌ రోల్‌. మామూలుగా అయితే, ఆమె రోల్‌కి ప్రమోషన్స్‌లోనూ ఫుల్‌ ఇంపార్టెన్స్‌ వుండాలి. కానీ, అది బాలీవుడ్‌ మూవీ కాదు కదా.! అందుకే, ప్రతిసారీ బేవాచ్‌ ప్రోమోస్‌లో ప్రియాంకా చోప్రాని పక్కన పడేస్తున్నారు. డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి.. ఇవాళ ఓ టీజర్ రిలీజ్ అయింది.

మొత్తం ట్రైలర్ అంతా హాట్ గాళ్స్.. బీచ్ హంగామా.. యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగింది కానీ.. ఒకే ఒక్క చోట మాత్రం ప్రియాంక చోప్రా పిచ్చ హాటుగా దర్శనం ఇచ్చింది. పూర్తిగా రివీలింగ్ డ్రెస్ తో క్లీవేజ్ అందాలను ఆరబోసేస్తూ.. ప్రియాంక ఇచ్చిన ఆ ఒక్క సీరియస్ లుక్.. ట్రైలర్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది.

మరీ ఇంతతక్కువ సేపు కనిపించటం నిజంగా అభిమానులకి నిరాశ కలిగించే విషయమే అయినా ప్రియాంక పూర్తి పెర్ఫార్మెన్స్ ని సినిమాలోనే చూసి థ్రిల్ల్ పొందటమూ ఒక ఆనందమే కదా. ఇదేంటీ మా పీసీని ఇలా సింగిల్ షాట్ కే లిమిట్ చేసేశారు అనుకునే ప్రియాంక అభిమానులు ఉన్నారు కానీ.. ఈ సినిమాలో ఈమె చేస్తున్నది ఓ విలన్ రోల్. ఈ సెక్సీ విలన్ గర్ల్ సినిమా పై మరిన్ని విషేశాలు...

ప్రియాంక సాధించిందేంటి.:

ప్రియాంక సాధించిందేంటి.:

హాలీవుడ్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో'తోపాటు హాలీవుడ్‌ మూవీ 'బేవాచ్‌' కోసం చాలా బాలీవుడ్‌ ఆఫర్లను ప్రియాంకా చోప్రా వదిలేసుకుంది. మరి, ఇంత త్యాగం చేసి ప్రియాంక సాధించిందేంటి.? అంటే, ప్చ్‌.. అప్పుడే చెప్పేయలేం.! ప్రియాంకా చోప్రా అయితే ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది. అటు క్వాంటికో, ఇటు బేవాచ్‌ మూవీ తనకు హాలీవుడ్‌లో మంచి గుర్తింపుని తెచ్చిపెడ్తాయని అంటోంది. ఇప్పటికే క్వాంటికో సంచలనాలు సృష్టించేస్తోందని చెబుతోంది ప్రియాంక.

మనకు మాత్రమే హాట్:

మనకు మాత్రమే హాట్:

ఇక, తాజాగా విడుదలైన 'బేవాచ్‌' ప్రోమోలో ప్రియాంకా చోప్రాని ఒకటి రెండు సెకెన్లపాటు కూడా పూర్తిగా చూపించలేదు. కానీ, ఆ కన్పించిన కాస్సేపట్లోనే సూపర్బ్‌ హాట్‌గా దర్శనమిచ్చింది.అయితే ఇది మనకు మాత్రమే హాట్ అనుఇకోవాలి హాలీవుడ్ సినిమాలో ఉండేటంత హాట్ అని మాత్రం అనలేం. అయితే సినిమాలో అమ్మడి పాత్రకి ఉన్న ప్రియార్తీ ఏమితో తెలుసుకోవాలంటే మాత్రం సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.

ట్రైలర్ అంతా హీరో యాంగిల్ లోనే:

ట్రైలర్ అంతా హీరో యాంగిల్ లోనే:

ఇప్పుడు రిలీజ్ చేసిన బేవాచ్ ట్రైలర్ అంతా హీరో యాంగిల్ లోనే నడిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. పైగా.. బాలీవుడ్ భామలను లీడ్ రోల్స్ లోకి తీసుకున్నపుడు.. వీరికోసం స్పెషల్ గా ఇండియన్ వెర్షన్ ట్రైలర్ లను కూడా వదులుతున్నారు బాలీవుడ్ మేకర్స్. సో.. ఇప్పటికైతే ప్రియాంకా అభిమానులు ఒక్క హాట్ లుక్ తో సరిపెట్టేసుకోక తప్పదు కానీ.. ఇంతకు మించి విలన్ రూపంలో ప్రియాంక చేయబోయే హంగామా కోసం ఎదురుచూడాలి మరి.

అసహ్యించుకోవడం ఖాయం:

అసహ్యించుకోవడం ఖాయం:

బేవాచ్ ఫిల్మ్ లో అందాలు ఆరబోయనున్న ప్రియాంక చోప్రా కొన్ని సీక్రెట్స్ చెప్పింది. ఆ హాలీవుడ్ ఫిల్మ్ లో తన పాత్ర క్రూరంగా ఉంటుందని తెలిపింది. తానో రాక్షసినని, అమెరికా తనను అసహ్యించుకోవడం ఖాయమని చెప్తే ఎమో అనుకున్నాం గానీ కొత్తగా పోస్ట్ చేసిన ఫొటోతో తన కౄరత్వాన్ని బయట పెట్టింది ప్రియాంకా చోప్రా.

'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా:

'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా:

1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై బుల్లి తెర ప్రేక్షకుల్ని అలరించిన 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే పేరుతో ప్రస్తుతం సినిమాని రూపొందిస్తున్నారు. కాకతాళీయంగానే అయినా ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం. హాలీవుడ్ లో విలన్ అయినా కూడా గ్లామర్కీ, నటనకీ స్కోపున్న పాత్ర కాబట్టే ప్రియాంకా ఈ ఆఫర్ని వదులుకోలేదు.

ఐడియా నాకూ నచ్చింది:

ఐడియా నాకూ నచ్చింది:

గతం లో కూడా ఇదే విషయంపై ప్రియాంక స్పందిస్తూ, '2015లో ఈ స్క్రిప్ట్‌ విషయమై దర్శకుడు నాతో సంప్రదించారు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడి కోసం ఆయన విలన్‌ పాత్ర రాసుకున్నారు. అది కేవలం మగాళ్ళు మాత్రమే నటించే పాత్ర. స్క్రిప్ట్‌ విన్న తర్వాత ఇందులో ఓ మంచి పాత్ర కావాలని ఆడిగాను. ప్రతినాయకుడి పాత్రకి బదులు ప్రతినాయకిగా నేను నటిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఆయన చెప్పిన ఐడియా నాకూ నచ్చింది. దీంతో విలన్‌గా నటించేందుకు గ్రీన్‌స్నిగల్‌ ఇచ్చాన'ని చెప్పినప్పింది కూడా.

చెడ్డవాళ్లుగానే ఉండండి:

చెడ్డవాళ్లుగానే ఉండండి:

ఇదివరలో ఈ అందాల రాక్షసి ఫోజులో ఉన్న హారర్ ఫొటోని హాలోవీన్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రియాంక ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 'బేవాచ్" మూవీ టైటిల్ కింద ''ముందడుగేయండి, చెడ్డవాళ్లుగానే ఉండండి"" అనే ట్యాగ్ లైన్ ప్రియాంక పిక్చర్ కు అతికినట్టు సరిపోయింది. హాలీవుడ్ తొలి మూవీలోనే విలన్ రోల్ పట్టేసిన ప్రియాంకా చోప్రా కి ఇదే మొదటి విలన్ రోల్ ఏం కాదు...

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర:

నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర:

'ఐత్ రాజ్" అనే హిందీ సినిమాలోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించి మెప్పించింది. హాలీవుడ్ లోనూ అదే సెంటిమెంట్ తో మొదలు పెట్టటం తో ఇక్కడ కూడా పాత హిస్టరీ రిపీట్ చేసేందుకు అమ్మడు ఉత్సాహపడిపోతోంది. క్వాంటికో సిరీస్ తో ఎలాగూ అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా 'బేవాచ్'తో హాలీవుడ్ ని కూడా ఒక ఊపు ఊపేయాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్.

విక్టోరియా లీడ్స్‌:

విక్టోరియా లీడ్స్‌:

ఈ సినిమాలో ప్రియాంక ఆయిల్‌ వ్యాపారవేత్త విక్టోరియా లీడ్స్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఎంపికైన విషయం తెలియగానే తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా ‘‘ఇది అధికారికంగా తెలియజేయాల్సిన సమయం. ‘బేవాచ్'లో చేయబోతున్నా. నాది బ్యాడ్‌ కేరక్టర్‌'' అని తెలిపింది ప్రియాంక. గతంలో ఆమె బాలీవుడ్‌ సినిమా ‘ఐత్‌రాజ్‌'లో విలన్‌గా నటించి ఆకట్టుకున్న విషయం గమనార్హం. సేథ్‌ గోర్డాన్ డైరెక్ట్‌ చేసే ‘బేవాచ్'లో జాక్‌ ఎఫ్రాన్, కెల్లీ రోర్‌బాచ్ మరో రెండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2017 మేలో ఈ సినిమా విడుదలవుతుంది.

బాండ్‌గర్ల్‌గా నటించాలని ఉంది:

బాండ్‌గర్ల్‌గా నటించాలని ఉంది:

ఇదిలా ఉంటే, జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో భాగంగా రూపొందబోయే తదుపరి చిత్రంలో బాండ్‌ గర్ల్‌గా ప్రియాంకకు నటించే అవకాశం వచ్చిందని సామాజిక మీడియా కోడై కూస్తోంది. ఈనేపథ్యంలో దీనిపై ప్రియాంక స్పందిస్తూ, 'నేను బాండ్‌ గర్ల్‌గా కనిపించాలని అభిమానులతోపాటు ఇతర ప్రేక్షకులు సైతం అభిలషిస్తున్నారు. ఛాన్స్‌ వస్తే బాండ్‌గర్ల్‌గా నాకూ నటించాలని ఉంది. బాండ్‌గర్ల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కోసం నేనూ ఎదురు చూస్తున్నా' అంటూ చెప్పింది. కానీ ఈ విషయం పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు...

దీపికా పడుకొనే :

దీపికా పడుకొనే :

అయితీఅ ఈ విషయం కాస్త పక్కన పెడితే ప్రియాంకతో సమానంగా హాలీవుడ్ రంగం లోకి దిగిన దీపికా పడుకొనే ఒక విషయంలో మాత్రం ఇప్పుడే ప్రియాంకా చోప్రాని బీట్ చేసేసింది. ఎందులో అంటే ... ప్రియాంకా చోప్రా... దీపికా పడుకోన్‌... ఎవరు హాటెస్ట్‌? ఎవరు సెక్సీయెస్ట్‌? ఈ ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా జనం దీపికకే జై కొట్టారు.

సెక్సీయెస్ట్‌ స్టార్‌ టైటిల్‌:

సెక్సీయెస్ట్‌ స్టార్‌ టైటిల్‌:

దీంతో నాలుగేళ్ల పాటు సెక్సీయెస్ట్‌ స్టార్‌ టైటిల్‌ను ఎంజాయ్‌ చేసిన ప్రియాంక ఐదోసారి వెనకబడ్డారు. 2016లో సెక్సీయెస్ట్‌ ఆసియన్‌ ఉమన్‌గా దీపిక నిలిచారు. బ్రిటన్‌ కేంద్రంగా నడిచే ఈస్ట్రన్‌ ఐ అనే వార్తా పత్రిక ప్రతి ఏటా ఈ సర్వే నిర్వహిస్తోంది. అందులో ఎక్కువ మంది మెచ్చిన వారిని ఆసియన్‌ సెక్సీయెస్ట్‌ ఉమన్‌గా ప్రకటిస్తోంది.

ప్రియాంక రెండో స్థానం:

ఈ ఏడాది టాప్‌టెన్‌ జాబితాలో దీపిక అగ్రస్థానంలో నిలవగా... ప్రియాంక రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక తొలిసారి అలియా భట్‌(ఐదోస్థానం) ఈ జాబితాలో స్థానం సంపాదించింది. నటి నియా శర్మ మూడో స్థానంలో నిలిచి సెక్సీయెస్ట్‌ టీవీ స్టార్‌ టైటిల్‌ను కూడా నిలబెట్టుకుంది. నాలుగో స్థానంలో టీవీ నటి ద్రష్టి ధామి, సనయా ఇరానీ ఆరోస్థానంలోనూ, కత్రినా ఖైఫ్‌ ఏడో స్థానంలోనూ, సోనమ్‌ కపూర్‌ ఎనిమిదో స్థానంలోనూ, పాకిస్థానీ నటి మహిరా ఖాన్‌ తొమ్మిదో స్థానంలోనూ, గహర్‌ఖాన్‌ పదో స్థానంలోనూ నిలిచారు. ఈ జాబితా ఎంపిక కోసం ఈస్ట్రన్‌ ఐ ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ పోల్‌ నిర్వహించింది. ఇందులో లక్షలాది మంది భాగస్వాములయ్యారు.

English summary
In the theatrical trailer of 'Baywatch' Priyanka's appearance is restricted to just 2-seconds. All you would see is her deadly blink of eyes here and she goes missing in a flash. Still, She makes her presence felt and that's what really matters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X