»   » అనుష్క ‘రుద్రమదేవి’ స్థానంలోకి హీరో నాని!

అనుష్క ‘రుద్రమదేవి’ స్థానంలోకి హీరో నాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి' సెప్టెంబర్ 4న విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే పోస్టు ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగులో ఉన్న కారణంగా ఈసినిమాను అనుకున్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని తెలుస్తోంది. రుద్రమదేవి వాయిదా నిర్ణయం నేపథ్యంలో సెప్టెంబర్ 4న నాని హీరోగా తెరకెక్కుతున్న ‘భలే భలే మగాడివోయ్' చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, GA2 (A Division of GeethaArts) బాన్య‌ర్ పై UV Creations సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపొందిస్తున్న ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్". నాని, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తున్నారు. మారుతి ద‌ర్శకుడు. బ‌న్నివాసు నిర్మాత‌.

రెగ్యులర్ సినిమాలతో పోల్చితే భలే భలే మగాడివోయ్ సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతీ అంశాన్ని చాలా కేర్ ఫుల్ గా చిత్రీకరిస్తున్నాం. నాని, లావణ్య మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, నాని,న‌రేష్,వెన్నెల కిషోర్ ల మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కడుపుబ్బ నవ్విస్తాయి అంటున్నారు దర్శకుడు మారుతి.

BBM occupies Rudhramadevi's spot

ఏక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. మారుతి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోత్త‌జోన‌ర్ లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా చిత్రీకరిస్తున్నాం. ఫ్యామిలి అంతా న‌వ్వుకునే విధంగా వుంటుంది అంటున్నారు నిర్మాత బన్నీ వాసు.

నాని, లావ‌ణ్య త్రిపాఠి, ముర‌ళి శ‌ర్మ‌, న‌రేష్‌, సితార‌, స్వ‌ప్న మాధురి, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్‌, బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు నటించారు. ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌, ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌, ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి, సంగీతం: గోపి సుంద‌ర్, నిర్మాత:బ‌న్నివాసు, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి.

    English summary
    Latest buzz reveals that Rudhramadevi film has been postponed yet again by a week and it will now release on 11th September. While the reasons for this sudden postponement is not known, the delay seems inevitable. Quickly jumping at this opportunity, the makers of Nani-Lavanya Tripathi's cute, romantic entertainer Bhale Bhale Magadivoy grabbed the 4th September slot.
    Please Wait while comments are loading...