»   » పోలీసుల ప్రయత్నం, మేము సైతం అంటూ సినీస్టార్స్ (ఫోటోలు)

పోలీసుల ప్రయత్నం, మేము సైతం అంటూ సినీస్టార్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నగరంలో రోజురోజుకు పెరిగి పోతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసులు ముప్పతిప్పలు పడుతున్న సంగతి తెలిసిందే. నేరాలను తగ్గించాలంటే ముందు ప్రజల్లో అవగాహన తేవాలని, మోసాలు, దొంగతనాలు బారిన పడకుండా... ఒక వేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా అప్రమత్తంగా వ్యవహరించాలనే సందేశం ఇస్తూ ఓ యాడ్ ఫిల్మ్‌కు ప్లాన్ చేసారు.

ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ సాధారణ నటులతో కాకుండా స్టార్ హీరోలతో చేస్తే మంచి ఎఫెక్ట్ కనిపిస్తుందని భావించిన పోలీసులు విక్టరీ వెంకటేష్‌తో 'బి అలెర్ట్' అనే షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ స్టార్స్ హాజరయ్యారు.

హాజరైన వారిలో దాసరి నారాయణరావు, కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు దంపతులు, వెంకటేష్, తదితరులు ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

యాడ్ ఫిల్మ్ ఆవిష్కరణ

యాడ్ ఫిల్మ్ ఆవిష్కరణ


హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ, తెలుగు సినిమా స్టార్స్ ‘బి అలర్ట్' యాడ్ ఫిల్మ్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం. ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు దంపతులు, వెంకటేష్, తదితరులు ఉన్నారు.

ప్రసాద్ ల్యాబ్స్‍‌లో షో...

ప్రసాద్ ల్యాబ్స్‍‌లో షో...


యాడ్ ఫిల్మ్ ఆవిష్కరణ అనంతరం ప్రసాద్ ల్యాబ్స్‌లో దాన్ని ప్రదర్శించారు. దీన్ని చూసిన సినీ ప్రముఖులు ప్రజల్లో మంచి అవగాహన పెంచేదిగా ఉందని మెచ్చుకున్నారు.

వెంకటేష్

వెంకటేష్


తెలుగు స్టార్ హీరో వెంకటేష్ ఈ యాడ్ ఫిల్మ్‌లో ప్రధాన పాత్రలో నటించారు. ఆయన ద్వారా పోలీసులు సందేశాత్మక ఈ ప్రకటన ప్రేజలకు మరింత చేరువవుతుందని భావిస్తున్నారు.

యాడ్ ఫిల్మ్

యాడ్ ఫిల్మ్


హైదరాబాద్ పోలీసులు శాఖ వారు రూపొందించిన ‘బి అలర్ట్' యాడ్ ఫిల్మ్‌లోని ఓ దృశ్యం.

ప్రచారం..

ప్రచారం..


ఈ యాడ్ ఫిల్మ్ నగరంలోని థియేటర్లు, టెలివిజన్లలో ప్రజల ప్రయోజనార్థం ప్రదర్శించనున్నారు.

English summary
Hyderabad CP Anurag Sharma launched 'Be Alert' AD film at Prasad labs. Tollywood stars Dasari Narayana Rao, Krishna, Krishnama Raju, Venkatesh attended.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu