»   » 'పొగ తాగద్దు' ...అంటూ యంగ్ హీరో ప్రచారం(వీడియో)

'పొగ తాగద్దు' ...అంటూ యంగ్ హీరో ప్రచారం(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: మంచైనా, చెడైనా తమ అభిమాన హీరోలు చెప్తే ఎక్కినట్లు మిగతా వారు ఎంత ముద్దుగా చెవిలో ఇల్లు కట్టుకు చెప్పినా బుర్రకు ఎక్కదు. అది గమనించినట్లున్నాడు బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్. తనవంతు సాయింగా పొగ త్రాగటాన్ని తప్పు పడుతూ..మానేయండి అంటూ ప్రచారం మొదలెట్టాడు. ఈ మేరకు ఓ వీడియోని సైతం విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ వీడియోని చూడవచ్చు.

పొగ తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ అంటున్నారు. ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధూమపాన వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో వరుణ్‌ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా రూపొందించిన ' బి స్మార్ట్‌.. డోంట్‌ స్టార్ట్‌' అనే ప్రచార వీడియోలో వరుణ్‌ధావన్‌ నటించారు. సొసైటీ చేపట్టే అనేక కార్యక్రమాల్లో ధావన్‌ పాల్గొంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్ ధావన్... నటించింది రెండు సినిమాల్లోనే అయినా యవతలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అల్లరి పనులు చేసే చిలిపి పాత్రలంటే ఇష్టపడే ధావన్ తాను అటువంటి పాత్రలకు సరిగ్గా సరిపోతానని 'మై తేరా హీరో' సినిమాతో నిరూపించాడు. తాజాగా 'హంప్టీ శర్మా కి దుల్హనియా'లో కూడా దాదాపుగా అదేరకమైన పాత్ర దక్కింది. 'సరిగ్గా నేను ఎటువంటి పాత్రలనైతే ఇష్టపడతాను అటువంటి పాత్రల్లోనే నటించే అవకాశం వస్తోంది.

Be Smart, Don't Start! - VARUN DHAWAN, Anti-Smoking Campaign

ఇక...ఏబీసీడీ-2 చిత్రంలో తన డ్యాన్స్‌తో బాలీవుడ్‌ ఇండస్ట్రీనే మెప్పించాడు వరుణ్‌. తనకే కాక, ఈ తరానికే డ్యాన్స్‌లో స్ఫూర్తి హృతిక్‌ రోషన్‌ అని వరుణ్‌ తెలిపాడు. అయితే బాలీవుడ్‌లో ప్రతి ఒక్కరికి ఒక్కో స్త్టెల్‌ ఉందని, డ్యాన్స్‌ విషయంలో తనకంటూ ఓ స్త్టెల్‌ ఉందని, హృతిక్‌తో తనని పోల్చి చూడద్దంటూ మీడియా వర్గాలతో అన్నాడు.

తాను కొత్తవాడినని, బాలీవుడ్‌ బెస్ట్‌ డ్యాన్సర్లలో ఇప్పుడే చేరలేనని చెప్పాడు. శ్రద్ధా కపూర్‌, ప్రభుదేవా, ధర్మేశ్‌ యెలండే, పునిత్‌ పథక్‌, లరేన్‌ గోట్లీబ్‌ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరి మన్ననలూ పొందింది.

తాను నటించిన 'హంప్టీ శర్మా కీ దుల్హానియా' చిత్రం తన జీవితాన్నే మార్చేసిందని బాలీవుడ్‌ యువ నటుడు వరుణ్‌ధావన్‌ పేర్కొన్నారు. ఈచిత్రంలో వరుణ్‌ధావన్‌ సరసన అలియాభట్‌ నటించింది. శశాంక్‌ కైతాన్‌ దర్శకత్వం వహించిన 'హంప్టీ శర్మాకీ దుల్హానియా' చిత్రం గతేడాది జులై11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం వరుణ్‌, అలియాలకు భారీ విజయాన్ని సంపాదించిపెట్టిన సంగతి తెలిసిందే.

English summary
An Anti-Smoking campaign by the Indian Cancer Society featuring VARUN DHAWAN and the actors of the film 'Time Out'. Produced by - Aexor Entertainment & Indian Cancer Society
Please Wait while comments are loading...