»   » పవన్ కళ్యాణ్.. అకీరాకు ఏం నేర్పుతున్నాడో చూడండి...

పవన్ కళ్యాణ్.. అకీరాకు ఏం నేర్పుతున్నాడో చూడండి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కారణాలు ఏవో మనకు తెలియదు కానీ... ఇద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయారనేది మాత్రం వాస్తవం. రేణు దేశాయ్ తో కలిసి పుణెలో ఉంటున్న తన పిల్లలను తరచూ వెళ్లి కలుస్తున్నారు పవన్ కళ్యాణ్. తండ్రిగా తన పిల్లలకు మంచి బుద్దులు నేర్పుతున్నారు. తాజాగా తమ కుమారుడు అకీరాకు పవన్ కళ్యాణ్ నేర్పిన వర్డ్స్ ను రేణు దేశాయ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.

రేణు దేశాయ్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ సినిమా?
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖుషి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. 2001లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ అప్పట్లో కలెక్షన్లు ఇరగదీసింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించబోతోందని తెలుస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నిర్మాత, దర్శకురాలు రేణు దేశాయ్ సహ నిర్మాతగా వ్యవహరించబోతోందని తెలుస్తోంది. ఇటీవల న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా రేణు దేశాయ్ ని కలిసిన సూర్య... ఈ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహహాన్ సంగీతం అందించబోతున్నారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుందని అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్ మరార్ నిర్మాత. ఏప్రిల్ 8, 2016లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారని సమాచారం. సమ్మర్ ట్రీట్ గా ఈ చిత్రం అలరించనుందని,అప్పుడైతే వేసవి శెలవలు కలిసి వస్తాయని టీమ్ భావిస్తోంది.

English summary
"Beautiful words from a father to his son," Renu Desai shared along with a picture.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu