»   » షాకవ్వాలా? ఆశ్చర్యపోవాలా? అన్నీ ముద్దు సీన్లే, అయినా... యు/ఎ?

షాకవ్వాలా? ఆశ్చర్యపోవాలా? అన్నీ ముద్దు సీన్లే, అయినా... యు/ఎ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బేఫికర్'.... ఈమధ్య కాలంలో బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన చిత్రం. కారణం సినిమా పబ్లిసిటీ వెరైటీగా చేయడమే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ 'యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రణవీర్ సింగ్, వాణి కపూర్ జంటగా నటించారు.

ఈ సినిమా ఇంతగా హాట్ టాపిక్ కావడానికి కారణం.....ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లన్నీ హీరో హీరోయిన్ల లిప్ లాక్ ముద్దులతో రిలీజ్ చేయడమే. నెలకోటి, వారానికి ఒకటి అంటూ ఈ సినిమా పోస్టర్లు ఇప్పటి వరకు దాదాపు 10 రిలీజ్ చేసారు.

మన దేశంలో సెన్సార్ నిబంధనలు కాస్త కఠినంగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో 'బేఫికర్' సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారనే చర్చ సాగుతోంది. సాధారణంగా ఒకటి రెండు ముద్దు సీన్లు, శృంగార సన్నవేశాలు ఉంటే సెన్సార్ వారు.... 'ఎ'(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇవ్వడం గతంలో చాలా సందర్బాల్లో చూసాం.

అన్నీ ముద్దు సీన్లు ఉన్నా

అన్నీ ముద్దు సీన్లు ఉన్నా

అయితే ‘బేఫికర్' సినిమాలో దాదాపు 30 ను0డి 40 ముద్దు సీన్లు ఉన్నా సెన్సార్ వారు ‘యు/ఎ'(పెద్దలు, పిల్లలు కలిసిచూడొచ్చు) సర్టిఫికెట్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది. అది కూడా ఒక్క ముద్దు సీన్ కూడా కట్ చేయకుండా. సినిమాకు ఇలాంటి సర్టిఫికెట్ రావడంతో చిత్రబృందం ఆనంద పడిపోతోంది. యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి నిరభ్యరంతంగా చూడొచ్చు అంటూ ప్రచారం చేస్తున్నారు.

సెన్సార్ తీరు మారిందా?

సెన్సార్ తీరు మారిందా?

గతంలో పోలిస్తే సెన్సార్ నిబంధనలు ఈ మధ్య సడలించారట. ఆ మధ్య ‘ఉడ్తా పంజాబ్' సినిమా విషయంలో సెన్సార్ భారీగా కోతలు పెట్టడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. దీంతో సెన్సార్ సభ్యుల ఆలోచన కూడా మారింది. ఈ పరిణామాలతో మున్ముందు మన ఇండియన్ సినిమాల్లో కూడా ముద్దు సీన్లు, సెక్స్ సీన్లు కామన్ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ముద్దులు పెట్టడానికి చాలా కష్టపడ్డ హీరో

ముద్దులు పెట్టడానికి చాలా కష్టపడ్డ హీరో

సినిమాలో క్లిష్టమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌ కోసం కష్టపడ్డామనో, రిస్కీ ఫైట్స్‌ కోసం కష్టపడ్డామనో చెబుతుంటారు హీరోలు. అయితే బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రం హీరోయిన్‌ పెదాలను ముద్దాడడానికి కష్టపడ్డాడట. ఎంతలా అంటే ముద్దులంటేనే మనోడికి చాలా విసుగొచ్చేసిందట. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న 'బేఫికర్‌' సినిమా మనోడికి ముద్దంటే చేదే అనే నిజాన్ని తెలియపరిచిందట. ఆ సినిమా హీరోయిన్‌ వాణీకపూర్‌ పెదాలను రణ్‌వీర్‌ లెక్కలేనన్ని సార్లు ముద్దాడాడు.

ప్రతి సీన్లోనూ ముద్దు

ప్రతి సీన్లోనూ ముద్దు

రణ్‌వీర్‌సింగ్‌, వాణికపూర్ జంటగా తెరకెక్కిన బేఫికర్ లో హీరో, హీరోయిన్ లు కలిసే ప్రతి సన్నివేశంలోనూ ఒక ముద్దు సీన్ పెట్టేశాడు దర్శకుడు ఆదిత్య చోప్రా.

ముద్దులతో అలసి పోయి

ముద్దులతో అలసి పోయి

గాఢమైన చుంబనాలు... ఒక యాంగిల్ లో కాదు, డిఫరెంట్ యాంగిల్స్ లో... దీంతో శరీరం అలిసిపోయింది..అంటూ "బేఫికర్'' సినిమాలో హీరోయిన్ వాణీకపూర్ తో సాగించిన ముద్దులాట గురించి ఆ మధ్య ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు రణవీర్ సింగ్.

కొంతకాలం దూరంగా ఉంటా

కొంతకాలం దూరంగా ఉంటా

‘సెట్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. ముందు పై పెదవిని ముద్దాడాలి.. ఆతర్వాత కింద పెదవి.. ఆపై సుదీర్ఘంగా చుంబించుకోవాలి.. ఒక్క యాంగిల్లో కాదు.. రకరకాల యాంగిల్స్‌లో.. నిజంగా ముద్దులు పెట్టీ పెట్టీ చాలా అలసిపోయాను. ఇక, ఇప్పట్లో ముద్దు సీన్లు ఉండే సినిమాలను అంగీకరించన'ని తేల్చిచెప్పేస్తున్నాడు రణ్‌వీర్‌.

మరోలా చూడొద్దు

మరోలా చూడొద్దు

ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్‌లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం.

English summary
"They (CBFC) have seen the movie, and we also got a U/A certificate," says Befikre actor Ranveer Singh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu