»   » ఆ ట్రైలర్ కి ఒక్కరోజులో కోటి వ్యూస్ దాటాయ్ : బాహుబలి కాదు బేగమ్‌జాన్

ఆ ట్రైలర్ కి ఒక్కరోజులో కోటి వ్యూస్ దాటాయ్ : బాహుబలి కాదు బేగమ్‌జాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశం మొత్తం ఇప్పుడు బాహుబలి మానియా మొదలయ్యింది గూగుల్ ట్రెండ్స్ లో కూడా బాహుబలి టృఐలర్ కనిపిస్తోంది. ఒక సునామీలా వస్తూన్న బాహుబలి 2 ప్రబంజనాన్ని కూడా తట్టుకొని ఇంకో ట్రైలర్ కూడా నిలబడింది. అదీ ఏస్టార్ హీరో దో, లేదూ వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ మూవీనో కాదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అదీ రెండేళ్ళ కిందవచ్చిన ఒక బెంగాలీ సినిమాకి రీమేక్ గా వస్తున్న బాలీవుడ్ సినిమా. లీడ్ రోల్ పాత్రలో విధ్యాబాలన్ నటించిన బేగమ్ జాన్ అనే సినిమా.. ఈ ట్రైలర్ ఒక్క రోజులోనే కోటి వ్యూస్ దక్కించుకుని ఇంకా అదే ఊపులో సాగుతోంది. ఇంతకీ అంత గా జనం ఎగబడటానికి ఆ సినిమాలో ఏం ఉందీ అంటే.....

విద్యాబాలన్

విద్యాబాలన్

డర్టీ పిక్చర్‌తో కలెక్షన్ల సునామీ సృష్టించి తన సత్తా ఏంటో చాటిన నటి విద్యాబాలన్. కథా ప్రధానమైన పాత్రలో నటిస్తూ అందరి మన్ననలు పొందుతున్న విద్యాబాలన్ బాలీవుడ్‌లో ఇప్పుడు మరో అరుదైన రికార్డ్ సృష్టించింది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం బేగం జాన్.

ముఖేష్ భట్, విశేష్ భట్ సంయుక్తంగా

ముఖేష్ భట్, విశేష్ భట్ సంయుక్తంగా

శ్రిజిత్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ముఖేష్ భట్, విశేష్ భట్ సంయుక్తంగా ప్లే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించిన బేగం జాన్ ట్రైలర్ మార్చి 14న విడుదలైంది. 'రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరాబాయి వంటి తదితరుల స్ఫూర్తితోనే ప్రస్తుతం నటిస్తున్న బేగం జాన్‌ పాత్రను రూపకల్పన చేయటం ఆనందంగా ఉంద'ని అంటోంది విద్యాబాలన్‌.

బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని'

బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని'

శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన బెంగాలీ చిత్రం 'రాజ్‌కహిని' ఆధారంగా బాలీవుడ్‌లో 'బేగం జాన్‌' చిత్రం తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్ విద్యాబాలన్ రేంజ్ ఏంటో మరోసారి నిరూపించింది. ట్రైలర్ విడుదలైన ఒక్కరోజులోనే యూట్యూబ్‌లో కోటి మందికి పైగా వీక్షించడం విశేషం.

నోరెళ్లబెడుతున్నారు

నోరెళ్లబెడుతున్నారు

ఓ స్టార్ హీరో సినిమాకు వచ్చినన్ని వ్యూస్ ఈ సినిమా ట్రైలర్‌కు వచ్చాయి. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి బాలీవుడ్ ప్రముఖులు కూడా నోరెళ్లబెడుతున్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్ ఓ వేశ్య పాత్రలో నటిస్తోంది. 1947కు ముందు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 14, 2017న బేగం జాన్ విడుదల కాబోతోంది. బెంగాలీ సినిమా రాజ్‌కహిని సినిమాకు రీమేక్‌గా బేగం జాన్ తెరకెక్కించారు.

బేగం జాన్‌ వ్యక్తిత్వం

బేగం జాన్‌ వ్యక్తిత్వం

విద్యాబాలన్‌ మాట్లాడుతూ,'ఈ చిత్రంలో నటించటానికి ప్రధాన కారణం బేగం జాన్‌ వ్యక్తిత్వం. వేశ్యా గృహంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో బేగం జాన్‌ ధైర్యసాహసాలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. రాణి లక్ష్మీబాయి, రజియా సుల్తాన్‌, మీరా బాయి వంటి హేమా హేమీల యాటిట్యూడ్‌ని స్ఫూర్తిగా తీసుకుని బేగం జాన్‌ పాత్రను మరింత బలోపేతం చేశారు. ఇటువంటి చిత్రంలో నటించటం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.

రెండు దేశాల సరిహద్దులో

రెండు దేశాల సరిహద్దులో

రెండు దేశాల సరిహద్దులో ఉన్న వేశ్యగ‌‌ృహాన్ని మధ్య విభజన రేఖ వెళ్తున్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇస్తారు. అందుకు జవాబుగా "మీరూ కోట అని నాలుకతోనూ, వేశ్యావాటిక అని మనసుతోనూ అనుకునే ఈ స్థలం .నా ఇల్లు..., నా దేశం.. విభజనను నేను ఒప్పుకొను. ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే వారి చేతులను, కాళ్లను, దేహాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తాను" అని హెచ్చరిస్తుంది.

 ఒకవేళ చావాల్సి వస్తే

ఒకవేళ చావాల్సి వస్తే

అధికారుల మాటవిని కోటను ఖాళీచేసి వెళ్లు. లేదా కుక్కచావు చస్తావు అని బెదిరిస్తారు. అందుకు జవాబుగా నన్నే బెదిరిస్తారా? ఒకవేళ చావాల్సి వస్తే ఈ కోట రాణిగా దర్జాగా మరణిస్తాను అని బేగం జాన్ హెచ్చరిస్తుంది. నెలరోజుల్లో కోటను ఖాళీ చేయాలని బెదిరిస్తే.. "నెలల్ని లెక్కించటం మాకు బాగా వచ్చు ప్రతీ నెలా ఎరుపురంగు చూపిస్తుంది (నెలసరి రక్తం)" అంటూ విధ్యాబాలన్ చెప్పిన డైలాగ్ కి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది.

rn

శ్రీజిత్‌ ముఖర్జీనే దర్శకత్వం

బెంగాలీలో విడుదలైన ‘రాజ్‌కహిని' చిత్రానికి రీమేక్‌గా ‘బేగమ్‌ జాన్‌'ను నిర్మిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన శ్రీజిత్‌ ముఖర్జీనే దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విద్యాబాలన్‌ లుక్‌ను బాలీవుడ్‌ డిజైనర్‌ రిక్‌రాయ్‌ డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Vidya Balan is back! The actress, who is known to deliver powerful performances, is all set to impress one and all with her performance in Begum Jaan. this Movie trailer crossed 10 million views in 24 Hours
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu