»   » సీరియస్ గా తీసుకున్నారు:ఎన్టీఆర్ మీద రూమర్, చార్మీ పేరు వినిపిస్తోంది

సీరియస్ గా తీసుకున్నారు:ఎన్టీఆర్ మీద రూమర్, చార్మీ పేరు వినిపిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసలే సంబంధాలు సరిగా లేని నేపథ్యంలో తాజాగా 'పైసా వసూల్‌' దర్శకుడు పూరి జగన్నాథ్‌ వెళ్లి నేషనల్‌ మీడియాకి తను రెడీ చేసిన క్యారెక్టర్‌ని ఎన్టీఆర్‌ కాపీ కొట్టాడని న్యూస్‌ లీక్‌ చేసాడంటూ కొత్త రూమర్ వచ్చింది. ఇంతకీ జగన్ చేసాడా లేదా అన్నది పక్కా కాలేదు గానీ ఇప్పటికే నందమూరి అభిమానుల్లోని రెండు వర్గాల్లో మంటలు రాజుకున్నాయి. అసలు పూరీ స్క్రిప్ట్ ని తారక్ కాపీ కొట్టటం ఏమిటని జూనియర్ అభిమానులూ, పూరీ కి న్యాయం జరగాలని బాలయ్య అభిమానులూ కాలుదువ్వుకున్నారు.

ఎన్టీఆర్ స్క్రిప్ట్ దొంగిలించాడనే

ఎన్టీఆర్ స్క్రిప్ట్ దొంగిలించాడనే

నిన్నటినుంచీ టాలీవుడ్ అంతా హాట్ హాట్ చర్చ ఇదే వ్యవహారం మీద నడిచింది. టెంపర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న పూరి ఓ స్టోరీని, కేరక్టరైజేషన్‌ను ఎన్టీఆర్‍‌కు వినిపించాడని, తాను చెప్పినటువంటి పాత్రను పోలిన విధంగా జై‌ పాత్ర ఉండటంతో పూరి షాకయ్యాడని, ఎన్టీఆర్ తాను చెప్పిన దాన్ని దొంగిలించాడనే అనుమానంలో పడిపోయారని ఆంగ్లపత్రికలో కథనం వచ్చింది.ఫ్యాన్స్ మధ్య గొడవ

ఫ్యాన్స్ మధ్య గొడవ

ఇక అక్కడ మొదలైన గొడవ ఫ్యాన్స్ మధ్య చిన్న సైజు యుద్దానికి తెర తీసింది. ఈ వార్త ఇండస్ట్రీ నుంచి బయటకు ఎలా పొక్కిందనే విషయం అప్పడు తెలియకపోయినా.. పూరీకి క్లోజ్‌గా ఉండే ఓ హీరోయినే ఇలా చేస్తోందని తాజాగా టాక్ వినిపిస్తోంది.పైసా వసూల్

పైసా వసూల్

బాలయ్యతో ‘పైసా వసూల్' సెట్లో ఉన్న పూరీ జగన్నాథ్ ‘జై' టీజర్ చూశాక ఇలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ గురించి తాను ఇదివరకే ఎన్టీఆర్‌తో చెప్పానని, అయితే అప్పుడు ఎన్టీఆర్ ఏ విషయమూ చెప్పలేదని పూరీ జగన్నాథ్ అన్నాడని ఆ హీరోయిన్ పుకార్లు పుట్టించిందట. ఆ హీరోయిన్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది అనుకుంటున్నారు.హీరోయిన్ చార్మీ

హీరోయిన్ చార్మీ

మరి పూరీకి అంత క్లోజ్ గా ఉండే హీరోయిన్, అదీ బాలయ్య సినిమా చేస్తున్న సమయం లో మీడియాకి ఇలాంటి లీక్ ఇవ్వగల చనువు ఉండే హీరోయిన్ ఎవరబ్బా అన్నది ఇప్పుడు టాలీవుడ్ ఆసక్తి. మరి పూరీకి దగ్గరగా ఉన్న హీరోయిన్ చార్మీ కి ఈ వివరాలేమైనా తెలుసంటారా..?? అసలు ఆ హీరోయిన్ చార్మీ నే అన్న రూమర్ కూడా వినిపిస్తోంది. ఏమో మరి ఎవరైనా చెప్పక పోతే తప్ప మనకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండీ...
English summary
social media trolls are started on Charming beauty Charmi who is working as line producer cum coordinate of Puri Connects for these rumors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu