»   »  లేచిపోయారు, గొడవ: డైరెక్టర్ విజయ్ కుమార్ పెళ్లి... తెర వెనక వాస్తవాలు!

లేచిపోయారు, గొడవ: డైరెక్టర్ విజయ్ కుమార్ పెళ్లి... తెర వెనక వాస్తవాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో నితిన్ హీరోగా 'గుండెజారి గల్లంతయ్యిందే', నాగ చైతన్య హీరోగా 'ఒక లైలా కోసం' చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ ప్రసూనను విజయ్ కుమార్ కొండ వివాహం చేసుకున్నారు.

మార్చి 1న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11.23 గంటలకు వీరి పెళ్లి జరిగింది. అయితే ఈ వివాహానికి ఈ డైరెక్టర్ ఎవరినీ పిలవక పోవడం, రహస్యంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

గాంధర్వ వివాహం

గాంధర్వ వివాహం

దర్శకుడు ఎవరినీ ఆహ్వానించకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడం వెనక వధువు తరుపు వారికి ఈ వివాహం అస్సలు ఇష్టం లేక పోవడమే అసలు కారణమని స్పష్టమవుతోంది. అందుకే గాంధర్వ వివాహం(సినిమా బాషలో చెప్పాలంటే లేచిపోయి పెళ్లి చేసుకోవడం) తప్పలేదు.

ఎలా పరిచయం

ఎలా పరిచయం

దర్శకుడు విజయ్‌కుమార్‌ వివాహం చేసుకునేందు మ్యాట్రిమోనియల్‌ సంస్థను సంప్రదించారు. ఈ క్రమంలోనే రామ్‌నగర్‌కు చెందిన ప్రసూనతో పరిచయం ఏర్పడింది.

పెళ్లికి నిరాకరణ

పెళ్లికి నిరాకరణ

మాట్రిమోనియల్ సంస్థ ద్వారా ఇటు విజయ్ కుమార్, ప్రసూన తరుపున సంప్రదింపులు జరిగాయి. త్వరలో పెళ్లి కూడా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విజయ్ కుమార్, ప్రసూన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఏమైందో తెలియదు కానీ ప్రసూన తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయితే అప్పటికే ప్రేమ మునిగి పోయిన విజయ్ కుమార్, ప్రసూన పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రహస్యంగా వివాహం

రహస్యంగా వివాహం

మార్చి 1న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 11.23 గంటలకు వీరి పెళ్లి రహస్యంగా జరిగింది. అనంతరం ఎర్రగడ్డలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహాన్ని నమోదు చేసుకున్నారు. పెళ్లి ర్వాత మధురానగర్‌లో కాపురం పెట్టారు.

ప్రసూన కుటుంబ సభ్యుల బెదిరింపులు

ప్రసూన కుటుంబ సభ్యుల బెదిరింపులు

తమకు తెలియకుండా వెళ్లి పెళ్లి చేసుకున్న కూతురు ఆచూకి తెలసుకున్న ప్రసూన కుటుంబ సభ్యులు వారిని బెదిరించడం ప్రారంభించారు. యువతి తల్లి విజయ్ కుమార్ మీద దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ కుమార్ దంపతులు ఎస్సార్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించారు. తాము మేజర్లమని, తమకు రక్షణ కల్పించాలని కోరారు.

మాయమాటలు చెప్పాడరి తల్లి ఆరోపణ

మాయమాటలు చెప్పాడరి తల్లి ఆరోపణ

తమ కూతురికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని, తమ కూతురు తమకు అప్పగించాలని ప్రసూన తల్లిదండ్రులు ఎస్.ఆర్.నగర్ పిఎస్ ఎదుట మంగళవారం ఆందోళన కూడా చేసారు. అయితే పోలీసులు ఇరు వర్గాలను కూర్చొబెట్టి ఈ విషయాన్ని సెటిల్ చేసినట్లు తెలుస్తోంది.

సినిమాలు

సినిమాలు

2013లో నితిన్ హీరోగా తెరకెక్కించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో విజయ్ కుమార్ కొండ దర్శకుడిగా మారారు. ఈ సినిమా మంచి హిట్టు కొట్టడంతో నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం' అనే సినిమా అవకాశం వచ్చింది. అయితే ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. విజయ్ కుమార్ కొండ ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేసే ప్లాన్లో ఉన్నాడట. వరుణ్ ప్రస్తుతం మిస్టర్ , ఫిదా అనే చిత్రాలు చేస్తుండగా వీటి తర్వాత తన మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

English summary
Gunde Jaari Gallanthayyinde fame director Vijay Kumar Konda married Prasoona secretly on March 1st against the wishes of Bride’s Parents. It seems that the director is in love with his ladylove. Media Reports said that, Prasoona’s Mother Swaroopa Rani manhandled Vijay Kumar Konda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu