రజనీకాంత్ తో పోలిక వద్దు
ధనుష్ మాట్లాడుతూ ''చిత్రసీమలో రజనీకాంత్ అల్లుడుగా నేను పొందింది ఏమీ లేదు. నేను ఎంపిక చేసుకొనే సినిమాలు భిన్నంగా వూంటాయి. అయినా ఇప్పటి వరకూ నేను చేసింది పాతిక చిత్రాలే'' అన్నారు.
అలాగే ' 'రాన్‌జానా' సినిమా గురించి రజనీకాంత్‌తో చర్చించనే లేదు. అంతేకాదు ఏ చిత్రం గురించి ఆయన దగ్గర చర్చలు సాగించను. ఎందుకంటే ఆయన తన పనుల్లో తీరిక లేకుండా వూంటారు. ఎప్పుడైనా కలిస్తే.. కుటుంబ విషయాలే ఎక్కువగా మాట్లాడుకుంటాం అన్నారు.
ఇక నేను హిందీలో నటిస్తున్నానని తెలియగానే నా భార్య ఐశ్వర్య చాలా ఆనందపడింది. చిత్ర దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ దగ్గర నటించినప్పుడు చాలా సంతోషం కలిగింది. అందుకే ఆయనతో మరో చిత్రం చేసేందుకు ఒప్పుకొన్నాను. ఆ వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఈ సినిమాకు నేను సహనిర్మాతగా వ్యవహరించబోతున్నాను అని తెలిపారు.
'రాంజానా' చిత్రం 21న హిందీలో, అదే రోజు 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ తెరపైకి రానుంది. దీంతో పాటు భరత్‌బాలా దర్శకత్వంలో నటించిన నేరు తమిళచిత్రం 'మరియన్' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications












