»   » స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన రాశి ఖన్నా ! ఈ వీడియోలో ఏముంది, ఏమిటా ప్రత్యేకత?

స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన రాశి ఖన్నా ! ఈ వీడియోలో ఏముంది, ఏమిటా ప్రత్యేకత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటమే కాదు, సమాజానికి సంభందించి విషయాలు ఎవర్ నెస్ ని తమ అభిమానుల్లో క్రియేట్ చేయటానికి సైతం మన హీరోయిన్స్ ముందు ఉంటున్నారు. తాజాగా రాశి ఖన్నా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళల గురించి 'బిలీవ్ ఇన్ యు' పేరుతో ఒక ప్రత్యేకమైన వీడియోని లాంచ్ చేశారు.

ఈ వీడియోని రాశిఖన్నా స్వయంగా నిర్మించడం విశేషం. ఈ వీడియో ద్వారా రాశిఖన్నా మహిళల గొప్పతనాన్ని చాలా అందంగా వివరించారు. ఇందులో 'ఎందుకు మీ కల మీరు పట్ల సర్దుకుపోతున్నారు, ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు, మీరు ఎవరితో పోరాడుతున్నారు..' అంటూ మహిళలను ప్రోత్సహించే విధంగా మాట్లాడారు. ఆ వీడియోలో ఏముందో మీరే చూడండి.

జెన్నిఫర్ అల్ఫోన్స్ ఈ కాన్సెప్ట్ ను తయారుచేసి డైరెక్ట్ చేశారు. రాశిఖన్నా ఈ వీడియోని తన ఫేస్ బుక్ పేజీ ద్వారా రిలీజ్ చేస్తూ 'ఈ వీడియోని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నా మొదటి వెంచర్ కూడా' అన్నారు. రెండు రోజుల క్రితం రాశిఖన్నా మహిళలను ఉద్దేశించి స్వయంగా రాసిన ఒక కవిత కూడా అందరినీ భలేగా ఆకట్టుకున్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది

Believe in You by Raashi Khanna video

ఇక ఈ వీడియోకు వాయిస్‌ఓవర్‌ కూడా రాశీఖన్నానే ఇవ్వనుండటం గమనార్హం. "నా మసుసుకు ఎంతో నచ్చిన ఓ సబ్జెక్టును మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందిస్తూ ప్రొడక్షన్ లో కూడా అడుగు పెడుతున్నా. ఇది ఒక చిన్న అతి చిన్న విప్లవం అధారంగా నిర్మితమైంది" అంటోంది రాశి ఖన్నా.

ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. 'మహిళా దినోత్సవం నా హృదయానికి చాలా దగ్గరైన రోజు. ఇందుకోసం నా వంతు కృషిగా ఏమైనా చేయాలనుకున్నా. అందుకే నా ప్రొడక్షన్‌లో ఈ వీడియోను తీసుకొస్తున్నా. తమను తాము విశ్వసిస్తే ఎలాంటి విజయాలు సాధించవచ్చో దీని ద్వారా చూపిస్తా. ఇది అందరికీ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు. అంతేకాకుండా ఆమె సొంతంగా రాసిన ఓ పద్యాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ఈ స్పెషల్ వీడియో గురించి చెబుతూ.. "ఇప్పుడు కాకపోతే మరెప్పుడు.. నేను కాకపోతే మరెవ్వరు" అంటూ ఓ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసిన రాశి ఖన్నా.. దానితో పాటే ఓ లెటర్ లో తను రాసిన కవితను కూడా అందించింది.

'వూహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టిన రాశీఖన్నా తనదైన స్టైల్ లో వరస చిత్రాలను చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు . ప్రస్తుతం రాశీ ఖన్నా పలు సినిమాలతో బిజీగా ఉండగా ఉన్ని కృష్ణన్-మోహన్ లాల్ ప్రాజెక్ట్ తో మలయాళం ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇందులో ఈ సుప్రీమ్ బ్యూటీ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుందట.

ఇక తెలుగులో గోపిచంద్ సరసన ఆక్సీజన్ మూవీలో నటించిన రాశి , రవితేజ టచ్ చేసి చూడు, జూనియర్ ఎన్టీఆర్ 27వ చిత్రాలలో హీరోయిన్ గా నటించనుంది. తమిళంలో సైతాన్ కా బచ్చా చిత్రం ఈ అమ్మడికి డెబ్యూ మూవీ కాగా ప్రస్తుతం ఈ చిత్రంతోను బిజీగా ఉంది రాశీ. ఇమైక్క నోడీగల్ అనే మరో తమిళ చిత్రంలో కూడా రాశీ నటిస్తుంది.

English summary
This is Raashi Khanna. I am really excited to share our small effort believeinyou which is directed by Jennifer Alphonsse on this internationalwomansday. I hope it transforms and inspires you to be the best version of yourself. BelieveInYou
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu