»   »  మళ్ళీనా...!? సెంటిమెంట్ వర్క్ ఔట్ అయితే ప్రతీ సినిమాకీ ఇక అల్లుడేనేమో

మళ్ళీనా...!? సెంటిమెంట్ వర్క్ ఔట్ అయితే ప్రతీ సినిమాకీ ఇక అల్లుడేనేమో

Posted By:
Subscribe to Filmibeat Telugu

డైరెక్టర్ బోయపాటి శ్రీను ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ కోసం మంచి స్క్రిప్ట్ తయారు చేసేసాదట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు కు ముందు బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యి ఎందుకో మనోడు సరైనోడు మొదలుపెట్టి పూర్తి చేసేసాడు. మరి ఇప్పుడు ఆ సినిమా ఐపోయిన్దికదా అందుకే ఆ సినిమా మీద పడ్డాడు ఇప్పుడు. విభిన్నమైన స్పందనల మద్య ఈ సినిమా మంచి సక్సెస్ ను సాదించింది. ఫాం లో లేని బెల్లంకొండ శ్రీనివాస్ కు కుడా ఇప్పుడు మంచి హిట్ కావాలి లేదంటే హీరో గా నిలదొక్కుకోవడం కష్టం అయితే ఇదే పనిమీద బోయపాటి ఉన్నాడు.

తొలి సినిమాకు అత్యధికంగా ఖర్చు చేసిన రికార్డు 'అల్లుడు శీను'దే కావచ్చు. అంత ఖర్చు పెట్టినందుకు శ్రీనివాస్ తొలి సినిమాకు మంచి హైపే వచ్చింది. పెట్టుబడి తిరిగిరాకపోయినా.. శ్రీనివాస్ స్థాయికి చెప్పుకోదగ్గ కలెక్షన్లే వచ్చాయి. అతడికి మంచి పేరూ వచ్చింది. కానీ శ్రీనివాస్ రెండో సినిమా 'స్పీడున్నోడు' మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి బోయపాటి శ్రీను లాంటి పెద్ద దర్శకున్ని పట్టుకొని ఎలా అయినా శ్రీనివాస్ ని హీరో గా నిలబెట్టాలని ట్రై చేస్తున్నారు.

'సరైనోడు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి.. బెల్లంకొండ సినిమా చేయడం ఆశ్చర్యమే. ఐతే గతంలో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ సినిమా చేయక తప్పట్లేదు బోయపాటికి. ఒక సినిమా పూర్తయ్యాక ఇంకో సినిమా స్క్రిప్టు తయారు చేయడానికి కనీసం నాలుగు నెలలు సమయం తీసుకునే బోయపాటి.. బెల్లంకొండతో సినిమా స్క్రిప్టును దాదాపుగా పూర్తి చేసేసాడట.

Bellamkonda Srinivas's Next is Alludu Bangaram

ఈ సినిమాకు 'అల్లుడు బంగారం' అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. తొలి సినిమా సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ఈ టైటిల్ పెట్టారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో ముఖ్య పాత్రను పోషించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ అంటూ అని కూడా వార్తలొచ్చాయ్.

అయితే వెంకీనా కాదా అన్నది క్లారిటీ లేదు కానీ.. ఓ స్టార్ హీరోతో గెస్ట్ రోల్ చేయిస్తే తప్ప ఈ సినిమాకు హైప్ రాదని బోయపాటి భావిస్తున్నాడట. తన తరహా యాక్షన్ సినిమానే అయినా గత సిని9మాలకంటే భిన్నం గా ఈ సారి లవ్ స్టోరీ ఎంచుకున్నాడు బోయపాటి.ఫిలిం నగర్ జనాల మాతలను బట్టి తెలుస్తున్న సంగతేంటంటే బెల్లం కొండ సీను ని డైరెక్ట్ చేయటానికి బోయపాటి సీను భారీ మొత్తాన్నే అందుకున్నాడట...

English summary
Bellamkonda Sai Srinivas, who made his debut with the film Alludu Seenu, will now be seen next in the direction of mass action entertainers specialist Boyapati Srinu. The latest buzz from the film nagar reveals that the film might be titled as Alludu Bangaram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu