twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'జోరు' కాదు: బెల్లంకొండ సురేష్

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''ఎన్టీఆర్‌ సినిమాకి 'జోరు' అనే పేరు పెట్టాం అనే ప్రచారం జరుగుతోంది. కానీ మా సినిమా 'జోరు' కాదు. ప్రస్తుతానికి 'రభస' అనుకొంటున్నాం. త్వరలోనే సరైన పేరు నిర్ణయిస్తాం. 2002 మార్చి 28న 'ఆది' సినిమా విడుదలైంది. మా సంస్థలో మేటి చిత్రంగా మిగిలింది. 2014లో అదే రోజున ఇప్పుడు తీస్తున్న ఎన్టీఆర్‌ సినిమాని విడుదల చేస్తాము''అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. గురువారం బెల్లంకొండ సురేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

    అలాగే ''ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ఇంతకాలం పట్టిందంటే దానికి కారణం.. 'ఆది'లాంటి గొప్ప కథ తొందరగా దొరకకపోవడమే. ఇన్నాళ్లకు సంతోష్‌ శ్రీనివాస్‌ ఆ తరహా కథని సిద్ధం చేశారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మరిచిపోలేని చిత్రంగా మలచడానికి మా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాం.'' అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత నటిస్తోంది. ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

    Bellamkonda Suresh about Joru title
    సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

    ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

    English summary
    JR.NTR's latest film Joru in the direction of Santhosh Srinivas is currently under production at brisk pace in RFC. Recently a schedule has been wrapped in Hyderabad. In this schedule few action sequences on NTR ,Shayaji Shinde and fighters will be canned in Ramoji Film City . Music is by Thaman and Bellamkonda Ganesh Babu is producing the film under Sri Sai Ganesh Productions banner. NTR's Joru is scheduled for 2014 Summer release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X