»   » బెల్లంకొండ సురేష్ అండతో బయిటపడ్డ లారెన్స్

బెల్లంకొండ సురేష్ అండతో బయిటపడ్డ లారెన్స్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : ప్రభాస్ 'రెబల్‌' సినిమాకి సంబంధించిన వివాదం లో రూ.2.5 కోట్లు నిర్మాతలకు చెల్లించాలని దర్శకుడు లారెన్స్‌కి నిర్మాతల మండలి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో లారెన్స్ కు బెల్లంకొండ సురేష్ అండగా ఉన్నట్లు సమాచారం. సినిమా హిట్, ప్లాప్ లకు ఒకర్ని భాధ్యత చేయలేతమని నిర్మాతల మండలిలో బెల్లంకొండ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతల మండలి..బెల్లంకొండ వ్యవహార శైలిపై సీరియస్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్సో వినపడుతోంది.

  అంతేకాకుండా లారెన్స్ నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సిన భాధ్యత ఆయనదేనని, లారెన్స్ ఒక వేళ చెల్లించకపోతే బెల్లంకొండ సర్ధుబాటు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పినట్లు చెప్తున్నారు. అయితే ఎందుకు లారెన్స్ విషయంలో బెల్లంకొండ అంతలా ఇంటర్ ఫియర్ అయ్యాడు అంటే...ఆయన లారెన్స్ తో ప్రస్తుతం ముని 3 చిత్రం చేస్తున్నాడు. ఆ డబ్బు చెల్లించందే లారెన్స్ తెలుగులో ఏ చిత్రం చేయకూడదని నిర్మాతల మండలి తెలియచేసింది. బెల్లంకొండ హామీ ఉండటంతో లారెన్స్ బయిటపడి..తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు.


  బుధవారం ముని 3 హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ చిత్రంలో లారెన్స్ కు జోడీగా తాప్సీ చేస్తోంది. 'ముని'కి సీక్వెల్‌గా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన 'ముని 2'ని తెలుగులో 'కాంచన' పేరుతో బెల్లకొండ సురేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకవైపు భయపెడుతూ, మరోవైపు నవ్విస్తూ ఈ 'కాంచన' అందర్నీ ఆకట్టుకుంది.

  నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న 'ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలూ తెలియజేస్తాను' అన్నారు.

  రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: విజయ్ ఆంథోని, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

  English summary
  
 Bellamkonda Suresh Supported Lawrence in Rebel Issue. Raghava Lawrence’s new movie ‘Muni 3’ launched at Annapurna Studios. Bellamkonda Suresh is producing ‘Muni 3’ on Sai Ganesh Productions banner. Taapsee Pannu is playing female lead opposite Lawrence for the first time in this action thriller. This is for the second time Bellamkonda Suresh is teaming up with Lawrence after super hit ‘Kanchana’. Bellamkonda is confident on the script of ‘Muni 3’ and predicts that this movie would be equally good like ‘Kanchana’.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more