twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమలు,పెద్దలు...అబద్దాలు (బస్‌స్టాప్‌ ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: 'ఈ రోజుల్లో' ఫేమ్ మారుతి దర్శకత్వం లో రూపొందిన 'బస్‌స్టాప్‌' ఈ రోజు రిలీజ్ అవుతోంది. 'లవర్స్‌ అడ్డా' అనేది ఉపశీర్షిక తో వస్తున్న ఈ చిత్రం యువతను ఎంటర్‌టైన్ చేస్తూనే వారికి వాత పెట్టే చిత్రం ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని దర్శకుడు మారుతి చెప్తున్నారు. మరో ప్రక్క దాదాపు నలభై రెండు సెన్సార్ కట్స్ ఇచ్చిన ఈ సినిమా తర్వాత రివైజింగ్ కమిటికి వెళ్లి కేవలం ఐదు కట్స్ తో బయిటకు వచ్చిందనే ప్రచారంకూడా జరుగుతూండటంతో ఈ సినిమాపై యూత్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ రోజుల్లో తరహాలోనే తమను అలరిస్తుందని భావిస్తున్నారు.

    శ్రీను (ప్రిన్స్‌), శైలు (దివ్య) చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. పదో తరగతి వరకూ కలిసే చదువుకొంటారు. ఆ తరవాత విడిపోతారు. దూరమైనప్పటి నుంచీ ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. శైలుకి అమ్మానాన్నలంటే చాలా గౌరవం. అలాంటి ఆ యువతి శ్రీను కోసం ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెడుతుంది. ఆ అబద్ధాల వల్ల కథ మలుపులు తిరుగుతుంది. ఇడ్లీ బండి మూర్తి, రావు బాబాయ్‌ పాత్రలూ కథలో కీలకమే.

    దర్శకుడు మాట్లాడుతూ ''నాలుగు ప్రేమ జంటల కథ ఇది. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎవరెవరు ఎలాంటి మార్గంలో వెళ్లారో చూపిస్తున్నాం. నిజ జీవితంలో మనకు ఎదురైన మనుషులు, వారి ప్రవర్తన... ఈ సినిమాలో కనిపిస్తాయి. మనం ఏ బస్సు ఎక్కాలో మన గమ్యస్థానమే నిర్ణయిస్తుంది. కానీ వాళ్లు మాత్రం అలా కాదు. అందమైన అమ్మాయిలు బస్సులలో ఉంటే... బోరబండ వెళ్లవల్సినవాడు కూడా బందరు బస్సెక్కేస్తారు. ఇలా ఆ కుర్రాళ్లు తమ జీవితాల్లో సగం బస్సుల్లోనే గడిపేశారు. ఇంతకీ ఎవరు ఏ గమ్యానికి చేరారో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. నేను ఎలాంటి సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడతానో, అలాంటి కథలనే సినిమాలుగా తీస్తా. బస్‌స్టాప్‌ల్లోనే కాలక్షేపం చేసేసే కుర్రాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది వినోదాత్మకంగా చూపిస్తున్నాం. '' అన్నారు.

    నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ " ఇది బెల్లంకొండ సినిమా కాదు. మారుతి సినిమా. మారుతిని నమ్మి నేను తీసిన సినిమా. ట్రైలర్ చూశాక పేరు, డబ్బు తెచ్చే సినిమా అని అర్థమైంది. సినిమా రిచ్‌గా, గ్రాండియర్‌గా ఉండాలని సినిమా ప్రారంభానికి ముందు మారుతికి చెప్పా. నేనేం చెప్పానో అదే తెరమీద కనిపిస్తోంది. యువతను బాగా ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.

    సంస్థ: శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ మరియు మల్టీడైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
    నటీనటులు: ప్రిన్స్‌, దివ్య, ఖన్నా, రావు రమేష్‌, అభి, హాసిక, గోపాల్‌సాయి, డి.ఎం.కె, సాయికుమార్‌ పంపన, రావిపల్లి రాంబాబు తదితరులు.
    సంగీతం: జె.బి.
    ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి.
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు,
    సహ నిర్మాత: బి. మహేంద్రబాబు.
    ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్,
    కళ: గోవింద్,
    కొరియోగ్రఫీ: రఘు, సతీశ్,
    కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.
    నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, గణేష్‌బాబు
    విడుదల: ఆదివారం.

    English summary
    Director Maruthi who shot to fame with the successful youthful entertainer - Ee Rojullo is back. He has made another youthful romantic drama titled Bus Stop. The film is now set for grand release on November 11, 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X