»   » లాస్ కు సిద్దమయ్యే అంత పెడుతున్నాడు

లాస్ కు సిద్దమయ్యే అంత పెడుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దాదాపు నలభై నుంచి నలభై ఐదు కోట్లు వరకూ బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద స్టార్స్ మీదే ఈ బడ్జెట్ తెలుగులో వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే రిటెన్స్ ఆ రేంజిలో లేకపోతే ఇబ్బంది అవుతుంది. మొదటి రోజు మార్నింగ్ షో కు వచ్చే టాక్ మీద రిటన్స్ ఆధారపడి ఉంటాయి. అదీ స్టార్ కు అయితే అవి కంటిన్యూ అవుతాయి. అదే కొత్త హీరో మీద అంత బడ్జెట్ పెడితే ఎంత పబ్లిసిటీ చేసినా జనాలను ఆకర్షించి, ఆ పెద్ద మొత్తాన్ని వెనక్కి తెచ్చుకోవటం కష్టం. అటువంటి అరుదైన ఫీట్ ని బెల్లంకొండ సురేష్ చేస్తున్నాడని వినికిడి.

ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాన్ని బట్టి... బెల్లంకొండ సురేష్ తన కుమారుడు హీరోగా చేస్తున్న అల్లుడు శ్రీను చిత్రం కోసం నలభై కోట్లు వరకూ పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ప్రమోషన్ కి మరో ఐదు కోట్లు పెట్టనున్నారని తెలుస్తోంది. అంటే మొత్తం నలభై ఐదు కోట్లు మొత్తం పెట్టుబడి అవుతుంది అన్నమాట. ఎంత వివి వినాయిక్ దర్శకుడు అయినా, కొత్త హీరో మీద ఆ బడ్జెట్ అంటే సేఫ్ కాదు అంటున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో వివి వినాయిక్ కి పది కోట్లు ఇచ్చారని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా సమంతకు రెండు కోట్లు ఇచ్చి ...కొత్త హీరో ప్రక్కన చేయటానికి ఒప్పించారని, తమన్నా ఐటం సాంగ్ కి అర కోటి దాకా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా బడ్టెట్ పెరిగిపోయిందని అంటున్నారు. అయితే కొడుకుని లాంచ్ చేయటానికి బెల్లంకొండ చేస్తున్న సాహసం అని చెప్తున్నారు.

Bellamkonda Suresh was prepared to lose

"వి.వి.వినాయక్‌ను నేను సొంత కొడుకులా భావిస్తాను. వినాయక్ ఇప్పుడు మా శ్రీనివాస్‌ను తన బిడ్డ అనుకుని ఎక్స్‌ట్రా కేర్ తీసుకుని సినిమా చేస్తున్నారు. కథ గురించి సినిమా కొంత లేట్ అయింది. కానీ బెస్ట్ కథ కుదిరింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్ ఇది. యాక్షన్, లవ్ ప్రధానంగా సాగుతుంది. నేను శ్రీనివాస్‌ను ఇంట్లోనే కొడుకుగా చూస్తున్నాను. సెట్‌లో తను ఓ మాస్ హీరో, నేనో ప్రొడ్యూసర్‌ని అంతే. బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాకే వినాయక్, ఛోటా.కె.నాయుడు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం వంటి గొప్ప టీమ్ దొరకడం అతని అదృష్టం. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఇది. వేసవి కానుకగా విడుదల చేస్తాం'' అని బెల్లంకొండ సురేష్ అన్నారు.

అలాగే వినాయక్‌కి భారీ పారితోషికం చెల్లించాననీ, అందుకే తను ఈ సినిమా ఒప్పుకొన్నాడని అనుకొంటున్నారు. కానీ అదేం కాదు. వినాయక్‌ వ్యక్తిత్వాన్ని డబ్బుతో కొనలేం. ఇది మా అబ్బాయి సినిమా అని ఎప్పుడూ అనుకోలేదు. వినాయక్‌ సినిమాకి శ్రీనివాస్‌ పనికొస్తాడా? లేడా? ఆయన జోరుకి సరితూగుతాడా? లేడా? అనే కోణంలోనూ ఆలోచించాం. అన్ని విధాలా సంతృప్తి పడిన తరవాతే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లాం అని తన కుమారుడుతో వివి వినాయిక్ దర్సకత్వంలో చేస్తున్న చిత్రం గురించి చెప్పుకొచ్చారు.

English summary
Bellamkonda Suresh was prepared to lose many crores in order to launch his son in style. Film circles estimate that the budget of this film has crossed 40 crore mark already.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu