»   » రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది

రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపత్ నంది దర్శకత్వంలో రాధామోహన్ నిర్మిస్తున్న ‘బెంగాల్ టైగర్' చిత్రాన్ని షూటింగ్ ప్రారంభం రోజునే వినాయక చవితి కానుకగా విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ 'కిక్ -2' విడుదలలో జరిగిన జాప్యం కారణంగా ఈ చిత్రం విడుదల దసరాకు, ఆ తర్వాత దీపావళికి వాయిదా వేశారు.

తాజాగా అందుతున్న ఇప్పుడు మరింత వెనక్కి వెళ్ళింది 'బెంగాల్ టైగర్'. నవంబర్ 27న సినిమాను విడుదల చేయాలని భావించినా... ఆ రోజున అనుష్క 'సైజ్ జీరో' వస్తుండటంతో డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావాలనే నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయమైన త్వరలోనే అఫీషియల్ ప్రకటన వస్తుందని అంటున్నారు.


ఈ చిత్రంలో రవితేజ తను అమితంగా ప్రేమించే తండ్రిని చంపిన విలన్స్ ని సంహరించి, పగ తీర్చుకునే కొడుకుగా కనిపించనున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా సాగనుందని తెలుస్తోంది. ర‌వి తేజ స‌ర‌స‌న త‌మన్న, రాశి ఖ‌న్నాలు ఆడిపాడ‌ునున్నారు.


Bengal Tiger release Postponed again

సంప‌త్ నంది రెండ‌వ సినిమా ర‌చ్చ‌లో కూడా త‌మ‌న్న‌నే హీరోయిన్ కావ‌డం విశేషం. ఏమైంది ఈ వేళ‌తో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కునిగా పేరు తెచ్చుకున్నాడు. రెండ‌వ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశాడు. ర‌చ్చ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్‌2 కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వ‌చ్చింది.


ఆ సినిమా స్రిప్టు త‌యారు చేసే ప‌నిలో దాదాపు 2 సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. కార‌ణం ఏంటో తెలియ‌దు కాని ఆ సినిమా నుంచి సంప‌త్ నంది త‌ప్పుకున్నాడు. అనూహ్యంగా ర‌వితేజాను డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ర‌వితేజకు త‌మ‌న్న‌తో తొలి సినిమా.

English summary
Makers have postponed the release of the Bengal Tiger movie. Earlier they have finalized release of the movie on November 27th and now it is going to be released on 4th December.
Please Wait while comments are loading...