»   » రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్' రిలీజ్ డేట్ ఖరారైంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది.

రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. వీరిద్దరూ మొదటిసారి రవితేజతో జోడి కడుతున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సూటయ్యే విధంగా సంపత్ నంది అవుట్ & అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


Bengal Tiger’s release date

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమన్ ఇరానీ, నాజర్, తనికెళ్ల భరణి, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఆ మధ్య రవితేజ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''సంపత్‌ నంది చెప్పిన కథ చాలా బాగుంది. ఒక్కసారి వినగానే ఓకే చెప్పేశా. అన్ని వర్గాల్నీ అలరించే అంశాలున్నాయి. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా సంపత్‌ నంది కథని తీర్చిదిద్దుతున్నాడు''అన్నారు.


''రవితేజతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అన్నీ ఈ చిత్రంలో ఉంటాయని' సంపత్ నంది చెప్పుకొచ్చారు. రవితేజ హిట్ చిత్రాల లిస్టులో ఇదీ చేరడం ఖాయమని యూనిట్ సభ్యులు అంటున్నారు.

English summary
It is already known that Mass Maharaja Ravi Teja and Sampath Nandi have teamed up for ‘Bengal Tiger’. The latest update is that the film will release on the 18th of September.
Please Wait while comments are loading...