»   »  బెస్ట్ ఆఫ్ లక్ టు ది టీమ్ : పూరి

బెస్ట్ ఆఫ్ లక్ టు ది టీమ్ : పూరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అశ్విన్‌, తేజస్వి కలిసి నటించిన 'జతకలిసే' సినిమా టీం కు పూరి జగన్నాద్ 'బెస్ట్ ఆఫ్ లక్ టు ది టీమ్' అని తన ట్విట్టర్ ఖాత ద్వారా తెలిపారు. దానికి సంబందించిన ట్వీట్ ఇక్కడ చూడండి.

చిత్రం విశేషాలకు వస్తే...జర్నీ నేపధ్యం లో సాగే లవ్ స్టోరి. ఈ సినిమాని వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం అటవీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల లో చిత్రీకరించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాను చూసిన వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి , మూవీని అవుట్ రేట్ చెల్లించి సినిమాను గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఆయన సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది.

Best of luck : puri wishes to Jathakalise tam

పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, సప్తగిరి, రాజుగారి గది ఫేమ్ విద్యుల్లేఖ రామన్(బుజ్జమ్మ),‘జబర్ దస్త్' రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, సాయికార్తీక్, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.

English summary
Puri tweeted: 'Best of luck to the team' for Jathakalise.
Please Wait while comments are loading...