»   » అదొక చెత్త సినిమా.... మోసం వల్లే మొగుడు వచ్చాడు: వాస్తవాలు ఒప్పుకున్న కృష్ణ వంశీ

అదొక చెత్త సినిమా.... మోసం వల్లే మొగుడు వచ్చాడు: వాస్తవాలు ఒప్పుకున్న కృష్ణ వంశీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొందరు డైరెక్టర్లు కమర్షియల్ సినిమాలు తీసి విజయం సాధిస్తే మరికొందరు సామాజిక సమస్యలపై సినిమాలు తీస్తారు. కమర్షియల్ గా హిట్స్ కూడా ఇస్తారు. కృష్ణవంశీ రెండో కోవకు చెందిన డైరెక్టర్. అభ్యుదయ భావాలతో, సోషల్ ప్రాబ్లెమ్స్ మీద కృష్ణవంశీ తీసిన సినిమాలు సమాజాన్ని ఎలర్ట్ చేశాయి. ప్రజల్ని చైతన్యపరిచాయి. సినిమా అనేది పవర్ ఫుల్ మీడియా. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సమాజానికి మంచి చేయవచ్చు. ఇది డైరెక్టర్ కృష్ణవంశీ థియరీ. ఆయన తీసిన చాలా సినిమాలు ఈ సిద్ధాంతంపై తీసినవేనని ఇంతవరకు వచ్చిన సినిమాల్ని గమనిస్తే తెలుస్తుంది. కృష్ణవంశీలో సామాజిక స్పృహ ఉంది. తపన ఉంది.

ఆయన ఆలోచనలు కమర్షియల్ సినిమా పరిధి దాటి ముందుకు వెళ్లాయి.తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. తొలి సినిమా 'గులాబి'తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఆయన తీసిన సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, చందమామ వంటి సినిమాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఇప్పటివరకు ఆయన 19 సినిమాలను తెరకెక్కించారు. అన్నింట్లోకి ఆయనకు నచ్చిన సినిమా 'చందమామ' అట.

Best to Worst Movies Directed by Krishna Vamsi

కృష్ణవంశీ ఇప్పటివరకు 19 సినిమాలు చేయగా అన్నింట్లోకి ఆయనకు నచ్చిన సినిమా 'చందమామ' అట. 'నేను తీసిన వాటిలో నాకు చాలా నచ్చినది చందమామ సినిమానే. మిగిలినవీ నాకు నచ్చినా.. పూర్తి సంతృప్తి ఇచ్చినది మాత్రం ఆ సినిమాయే అని తెలిపాడు. అలాగే 'డేంజర్‌' అనుకున్నంత విజయం సాధించలేకపోయినా.. అదీ నా మనసుకు నచ్చిన సినిమాయే. ఇక, నేను తీసినవాటిలో అత్యంత చెత్త సినిమా 'మొగుడు'. షూటింగ్‌ సమయంలోనే నాకు ఆ విషయం తెలిసిపోయింది. ఒకడు మోసం చేయడం వల్ల ఆ సినిమా చేయాల్సి వచ్చింది. అలాగే 'పైసా' సినిమా కూడా నా వరస్ట్‌ సినిమాల్లో ఒకట'ని కృష్ణవంశీ ఓపెన్‌గా చెప్పేసి తన నిజాయితీని మరోసారి నిరూపించుకున్నాడు.

English summary
"That was one of my worst movies" says krishna vamshi the Tollywood director about "Mogudu" his film with gopichand
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu