»   » సంపూర్ణేష్ బాబు...‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు’ (ట్రైలర్)

సంపూర్ణేష్ బాబు...‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు’ (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో... చరణ్, రాజ్, రోషన్, హమీదా ఇతర ముఖ్యతారాగణంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు'. మల్లుపూడి రామ్ జీ సమర్పణలో సాయి వెంకట్ ఎంటర్టెన్మెంట్స్, మారుతి టీం వర్క్స్ బ్యానర్స్ పై బోనం కృష్ణ సతీష్, అడగర్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మాజీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ సోమవారం ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ మారుతిగారు డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కిస్తూ కొత్త టాలెంటును ఎంకరేజ్ చేస్తున్నారు. టీజర్ చాలా బావుంది అన్నారు.

Bhadram be careful brother teaser Theatrical Trailer

మారుతి మాట్లాడుతూ ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు రోల్ అందరినీ ఎంటర్టెన్ చేస్తుంది అన్నారు. ఈ సినిమాను తన స్నేహితులు నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసాడు దర్శకుడు రాజేష్ పులి.

ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు, చరణ్, రాజ్, హమీదాతో పాటు సత్యం రాజేష్, సూర్య, ప్రభాస్ శ్రీను, వేణు గోపాల్, సారిక రామచంద్రరావు, జ్యోతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: జెబి, సినిమాటోగ్రఫీ: మల్హర్ భట్ జోసి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు: బోనం కృష్ణ సతీష్, అడగర్ల జగన్ బాబు, ఉప్పూలూరి బ్రహ్మాజీ, దర్శకత్వం: రాజేష్ పులి.

English summary
Watch Sampoornesh Babu's Bhadram Be Careful Brotheru Theatrical Trailer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu