»   » నాగార్జున ‘భాయ్’స్టైల్ అదిరింది (ఫోటోలు)

నాగార్జున ‘భాయ్’స్టైల్ అదిరింది (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కింగ్ నాగార్జున నటించిన 'భాయ్' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలయ్యాయి. ఈ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. నాగార్జున్ స్టైల్ యువ హీరోలకు ధీటుగా ఉందని, మాస్ ప్రేక్షకులను నచ్చే విధంగా 'భాయ్' సినిమా ఉంటుందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ చిత్రానికి పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు. స్లైడ్ షోలో ఫస్ట్ లుక్ ఫోటోలు, మరిన్ని వివరాలు.

ఫ్యాన్స్ హ్యాపీ

ఫ్యాన్స్ హ్యాపీ

‘భాయ్' మూవీ ఫస్ట్ లుక్‌పై అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన దానికంటే ఫస్ట్ లుక్ పోస్టర్లు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. సినిమా మాస్ హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అద్భుతమైన లొకేషన్లు

అద్భుతమైన లొకేషన్లు

‘భాయ్' చిత్రం షూటింగ్ 700ఏళ్ల చరిత్ర కలిగిన స్లోవేనియాలోని ఓ కోటలో జరిగింది. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఇటీవల చిత్రీకరించారు. పిక్చరైజేషన్‌కు బాగా పాపులర్ అయిన ఈ కోటలో చిత్రీకరణ జరుపడం సినిమాకు కలిసొస్తుందని యూనిట్ మెంబర్స్ భావిస్తున్నారు.

సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రచారం

సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రచారం

భాయ్ సినిమాకు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు నాగార్జున. ఇప్పటికే భాయ్ మూవీ ఫోటోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రచారం సినిమాకు ప్లస్సవుతుందని నాగార్జున తెలిపారు.

భారీ అంచనాలు పెట్టుకున్న నాగార్జున

భారీ అంచనాలు పెట్టుకున్న నాగార్జున

భాయ్ చిత్రంపై నాగార్జున భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ మధ్య నాగార్జునకు భారీ హిట్లేమీ లేవు. ఈ నేపథ్యంలో ఈచిత్రం తనకు పూర్వ వైభవం తెస్తుందని భావిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ప్రస్తుతం నాగార్జున ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించారు.

రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

సినిమా ఆడియో విడుదల ఈ నెలలోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. సినిమాను భారీగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పాతబస్తీ సెట్

పాతబస్తీ సెట్

ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు.

నథాలియా కౌర్

నథాలియా కౌర్

నథాలియా ‘భాయ్' చిత్రంలో ఐటం సాంగులో అందాల విందు చేయనుంది. ఈ పాటను మాంచి మాస్ మసాలా దట్టించి యమ సెక్సీగా రూపొందించారు. ఈ పాటలో నాగార్జున గెటప్ కూడా వెరైటీగా ఉండనుంది. ఆమె అందాలను జుర్రుకునే మొనగాడిలా, అరబ్ షేక్ గెటప్ లో నాగార్జున కనిపించనున్నారు.

దేవిశ్రీ సంగీతం

దేవిశ్రీ సంగీతం

దేవిశ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఈ చిత్రానికి హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. నాగార్జున ఇమేజ్‌కు తగిన విధంగా మాస్ బీట్లతో పాటు, మెలొడీ సాంగులు కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఆడియో విడుదల కోసం అంతా ఆసక్తిగా విడుదల చేస్తున్నారు.

English summary
Akkineni Nagarjuna’s ‘Bhai’ first look unveiled. ‘Bhai’ is expected to hit the screens sometime in September. Veerabhadram director of this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu