»   » మహేష్ పుట్టినరోజున ‘భాయ్’ ఫస్ట్ లుక్

మహేష్ పుట్టినరోజున ‘భాయ్’ ఫస్ట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కింగ్ నాగార్జున నటిస్తున్న 'భాయ్' చిత్రం ఫస్ట్ లుక్ ఆగస్టు 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడం గమనార్హం. ప్రత్యేకించి ఈ రోజే విడుదల చేయడం వెనక కారణం ఏమిటనే చర్చ ఫిల్మ్ నగర్లో సాగుతోంది.

పూలరంగడు, అహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీచాగోపాధ్యాయ్ హీరోయిన్. యాక్షన్ మరియు ఎంటర్టెన్మెంట్ జోడించి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హంసా నందిని, కామ్న జెఠ్మలానీ, నథాలియా కౌర్‌, సోనూసూద్, ఆశిష్‌ విద్యార్థి, అజయ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు నటిస్తున్నారు.

'భాయ్' చిత్రం షూటింగ్ 700ఏళ్ల చరిత్ర కలిగిన స్లోవేనియాలోని ఓ కోటలో జరిగింది. ఇక్కడ ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఇటీవల చిత్రీకరించారు. పిక్చరైజేషన్‌కు బాగా పాపులర్ అయిన ఈ కోటలో చిత్రీకరణ జరుపడం సినిమాకు కలిసొస్తుందని యూనిట్ మెంబర్స్ భావిస్తున్నారు.

సినిమా ఆడియో విడుదల ఈ నెలలోనే జరుగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్లో సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో పాత బస్తీ వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దారు. ఇక్కడ చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయి. నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి.

English summary
Akkineni Nagarjuna’s ‘Bhai’ first look will be unveiled on Friday, August 9th. ‘Bhai’ is expected to hit the screens sometime in September. Veerabhadram director of this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu