»   » 100 మందితో ‘భాయ్’ సాంగ్ షూటింగ్

100 మందితో ‘భాయ్’ సాంగ్ షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై వీరభద్రమ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'భాయ్' ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

సినిమా ప్రోగ్రెస్ గురించి దర్శకుడు మాట్లాడుతూ....నాగార్జున కెరీర్లో భాయ్ చిత్రం మరో సెన్సేషన్ హిట్ అవుతుంది. ఈ చిత్రంలో ఆయన మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ అందించారు. నాగార్జునతో 'భాయ్' లాంటి కమర్షియల్ ఎంటర్టెనర్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి బాబు మాట్లాడుతూ...సెప్టెంబర్ 3 నుంచి అన్నపూర్ణ స్టూడియోలో నిర్మిస్తున్న భారీ సెట్స్‌లో నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్, 100 మంది డాన్సర్లతో రాజు సుందరు నృత్య దర్శకత్వంలో 5 రోజుల పాటు పాట చిత్రీకరించడంతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. అతి త్వరలోనే ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.

నాగినీడు, జరాసా, వినయప్రసాద్, సంధ్యా, ఝనక్ ప్రసాద్, చలపతి, రాహుల్ దేవ్, వెన్నెల కిషోర్, ప్రసన్న, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, హేమ, రజిత, గీతాంజలి, టార్జాన్, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్, పృథ్వి, దువ్వాసి మోహన్, శ్రావణ్ తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.

English summary
Shooting of Akkineni Nagarjuna’s ‘Bhai’ is largely complete and only one song remains to be shot. The last song will be shot from the Sep 03. Richa is the heroine in this movie and Nagarjuna will be seen in a full fledged mass role. Veerabhadram is the director of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu