»   » సునీల్ కాదన్నది, మంచు విష్ణు చేస్తున్నాడు

సునీల్ కాదన్నది, మంచు విష్ణు చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒకరితో అనుకున్న ప్రాజెక్టు మరొకరితో కావటం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. అలాంటిదే ఇప్పుడు మరొకటి చోటుచేసుకుంది. సునీల్ తో చాలా కాలం క్రితం తణికెళ్ల భరణి దర్శకత్వంలో అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు చేతులు మారింది సారీ హీరో మారాడు. ఆ ప్రాజెక్టు మరేదో కాదు భక్త కన్నప్ప.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మొదట ఈ ప్రాజెక్టుని సునీల్ చేద్దామని తణికెళ్ల భరణి అనుకుని స్క్రిప్టుని సైతం పూర్తి చేసారు. అయితే అనుకోని కారణాలతో సునీల్ తప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టులోకి మంచు విష్ణు వచ్చి చేరారు. మంచు విష్ణు స్వయంగా ఈ ప్రాజెక్టుని తన 24 ఫ్రేమ్స్ ఫాక్టరీ పై రూపొందిస్తున్నారు. ఆయన ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ,తెలుగు,మళయాళ భాషల్లో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

Bhakta Kannappa: Sunil walks out, MV steps in!

అలాగే...ఈ చిత్రానికి భక్త అనేది తీసేసి కేవలం ' కన్నప్ప'అని పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు టైటిల్ ఇలా మారుస్తారనే సంగతి మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు మంచు విష్ణను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.ఈ లోగా మంచు విష్ణు వి రెండు చిత్రాలు పూర్తి అవుతాయి.

తనికెళ్ల భరణి పరిశ్రమలో సినీయర్ నటుడు, రచయిత కూడా. ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'మిథునం' చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భర్త కన్నప్ప చిత్రాన్ని ఆయన తనదై ప్రత్యేక శైలిలో తెరకెక్కిస్తారనే నమ్మకం పలువురు పరిశ్రమ పెద్దలు వ్యక్తం చేస్తున్నారు.

English summary
At last, Tanikella was able to find a replacement for Sunil and his choice is really surprising. Manchu Vishnu signed the project to play the lead role.
Please Wait while comments are loading...