»   » ‘భలే మంచి రోజు’: బావ హార్డ్‌వర్క్ గురించి మహేష్ (ఫోటోస్)

‘భలే మంచి రోజు’: బావ హార్డ్‌వర్క్ గురించి మహేష్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుధీర్ బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘భలే మంచి రోజు'. విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక బుధవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఆడియో సీడీలను రిలీజ్ చేసారు. తొలి సీడీని రానాకు అందించారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ....‘ట్రైలర్ చూసాక చాలా ఫ్రెష్, కొత్తగా అనిపించింది. కొత్త కంటెంటుతో ఉండే సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. సుధీర్ చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి. డెడికేషన్ ఉన్న పర్సన్. ఈ సినిమా ఆయన కెరీర్లో పెద్ద హిట్ కావాలని, స్టార్ హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాను. సుధీర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు ఆనందంగా ఉంది' అన్నారు.


దర్శకుడు శ్రీరామ్ మాట్లాడుతూ... సినిమా చేయడం నా డ్రీమ్. ఈ రోజుతో నా కల నెరవేరింది. నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరూ ఇష్టపడి చేసిన సినిమా ఇది. సుధీర్ చాలా కంఫర్టబుల్ హీరో. ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతం. సాయికుమార్ గారు, గోపాలకృష్ణ గారు ఇలా అందరూ బాగా చేసారు. నాకు సపోర్టు చేసిన అందరికీ థాంక్స్' అన్నారు.


ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రానా, సుధీర్ బాబుతో పాటు హీరోయిన్ వామిక, రోజీనా, సందీప్ కిషన్, పరుచూరి గోపాలకృష్ణ, హర్ష వర్దన్, దేవాకట్టా, లగడపాటి శ్రీధర్, శ్యామ్ దత్, దిల్ రాజు, నందిత, గౌతమ్, మారుతి, చరిత్ మానస్, దర్శన్, అనీల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.


సుధీర్ బాబు

సుధీర్ బాబు

భలే మంచి రోజు ఆడియో వేడుకలో బిగ్ సీడీని రిలీజ్ చేస్తున్న మహేష్ బాబు.


మహేష్, రానా

మహేష్, రానా

మహేష్ బాబు, రానా ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేష్ బాబు సీడీ ఆవిష్కరించి తొలి సీడీ రానాకు అందించారు.


సుధీర్ గురించి

సుధీర్ గురించి

సుధీర్ బాబు గురించి మహేష్ బాబు మాట్లాడుతూ సుధీర్ బాగా హార్డ్ వర్కర్, డెడికేషన్ ఉన్న వ్యక్తి అని పొగిడారు.


ఈ కార్యక్రమంలో...

ఈ కార్యక్రమంలో...

మహేష్ బాబు, రానా, సుధీర్ బాబుతో పాటు హీరోయిన్ వామిక, రోజీనా, సందీప్ కిషన్, పరుచూరి గోపాలకృష్ణ, హర్ష వర్దన్, దేవాకట్టా, లగడపాటి శ్రీధర్, శ్యామ్ దత్, దిల్ రాజు, నందిత, గౌతమ్, మారుతి, చరిత్ మానస్, దర్శన్, అనీల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.


సరదాగా..

సరదాగా..

ఈ ఆడియో వేడుకలో మహేష్ బాబు, రానా సరదా మాట్లాడుకుంటూ కనిపించారు.


వారసులు

వారసులు

తన వారసుడు గౌతంతో మహేష్ బాబు, తన ఇద్దరు కుమారులతో సుధీర్ బాబు.


English summary
Mahesh Babu, who always tries to put his family in the forefront, has once again graced his brother-in-law, Sudheer Babu's audio function and encouraged the upcoming hero. Sudheer's next outing, Bhale Manchi Roju, touted to be a comedy drama, had its audio launch yesterday at Shilpa Kala Vedika, in Hyderabad.
Please Wait while comments are loading...