For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుధీర్ బాబు 'భ‌లేమంచిరోజు' ఎంత వరకు వచ్చింది?

  By Bojja Kumar
  |

  'ప్రేమ‌ క‌థా చిత్రం',' కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని'లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం'భ‌లేమంచిరోజు'. ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది.ఈనెలాఖ‌రుకి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.

  విడుద‌ల‌య్యిన రెండు పోస్ట‌ర్స్ కి ప్ర‌శంశ‌లు సూప‌ర్‌స్టార్ మహెష్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్బంగా'భ‌లేమంచిరోజు'మెద‌టి పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ చాలా వైవిధ్యంగా వుందంటూ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి ప్ర‌శంశ‌లు వ‌చ్చాయి. అంతేకాదు హీరో సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ పోస్ట‌ర్ అని మెసెజ్ లు కూడా వచ్చాయి. ఒకమ్మాయి చైర్‌లో కూర్చోవ‌టం, బ‌ల్బ్ వెలుగుతూ, ప‌క్క‌నే హీరో సుధీర్‌బాబు నిల‌బ‌డి వుండ‌టం ఇలా చాలా వైవిధ్యంగా చేశారు. రెండ‌వ పోస్ట‌ర్ వినాయ‌క‌చ‌వితి సంద‌ర్బంగా విడుద‌ల చేశారు. మెదటి పోస్ట‌ర్ కి ఏమాత్రం సంబందం లేకుండా ల‌వ్‌లీ గా ఎన‌ర్జి గా వుందంటూ ప్ర‌శంసించారు. విడుద‌ల చేసిన రెండు పోస్ట‌ర్స్ కూడా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందాయి.

  Bhale Manchi Roju in last schedule

  సుధీర్‌బాబు స్టైలిష్ లుక్‌ ఇటీవ‌ల'భ‌లేమంచిరోజు'చిత్రానికి సంభందించి విడుద‌ల చేసిన రెండు పోస్ట‌ర్స్ లో కూడా సుధీర్‌బాబు చాలా ఢిఫ‌రెంట్ స్టైల్లో క‌నిపిస్తున్నారు. కాస్ట్యూమ్స్ నుండి హెయిర్‌స్టైల్ బాడీ లాంగ్వేజ్ ఇలా చాలా వైవిధ్యంగా క‌నిపిస్తున్నారు. సుధీర్‌బాబు చిత్రాల్లో ఇదే బెస్ట్ స్టైలిష్ ఫిల్మ్ కానుంద‌ని చిత్ర‌ యూనిట్ గ‌ర్వంగా చెబుతున్నారు.

  ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ "సుదీర్‌బాబు, వామిఖలు హీరోహీరోయిన్స్‌గా, శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రం'భ‌లేమంచిరోజు'. ఈచిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎక్క‌డా ఎటువంటి ఆటంకం లేకుండా అనుకున్న స‌బ్జెక్ట్ అనుకున్న‌ట్టుగానే తెర‌కెక్కించాం. ఈ నెలాఖ‌రుతో షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేస్తాము. ప్ర‌ముఖ న‌టుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈచిత్రం క‌థాంశం అంతా ఓక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆశ‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో, వినోద‌భ‌రితంగా తెర‌కెక్కుతుంది. ఈచిత్రానికి 'ఉత్త‌మ‌విల‌న్', 'విశ్వ‌రూపం2' చిత్రాల‌కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన షామ్‌ద‌త్‌ సినిమాటోగ్ర‌ఫి అందించారు.'స్వామిరారా','ఉయ్యాల జంపాల'చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాచిత్రంలో ప్ర‌తి ఫ్రేమ్ ని గ్రాండ్ గా చిత్రీక‌రించాము. క‌థ‌, క‌థ‌నాల‌ని న‌మ్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాము. హీరో సుధీర్‌బాబు లుక్ విష‌యంలో కేర్ తీసుకోవ‌టమే కాక పాత్ర విష‌యంలో మ‌రింత కేర్ తీసుకున్నాము. సుధీర్‌బాబు ప‌ర‌కాయ ప్ర‌వేశం లా ఇన్‌వాల్వ్ అయ్యి మ‌రీ న‌టించారు. ఆయ‌న కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంద‌ని నమ్ముతున్నాము. ఇటీవ‌లే చిత్రీక‌రించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ఇప్ప‌టికే ఆడియో విన్న ఆడియో కంపెనీల వారు ఉత్సాహం చూపిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆడియో డేట్, విడుద‌ల డేట్ తెలియ‌జేస్తాము. సుధీర్‌బాబు అభిమానుల‌తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటుంది" అని అన్నారు

  కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

  English summary
  Sudheer Babu's Bhale Manchi Roju in last schedule.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X