»   » భరత్ బహిరంగ సభలో ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన నిర్మాత

భరత్ బహిరంగ సభలో ఎన్టీఆర్‌కు సారీ చెప్పిన నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

భరత్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌కు నిర్మాత దానయ్య సారీ చెప్పారు. అంత పెద్ద సభ నిర్వహిస్తూ అన్నీ పనులు చూసుకున్న ఆయన ఈ టెన్షన్లో ముఖ్య అతిథి ఎన్టీఆర్ గురించి తన ప్రసంగంలో మాట్లాడటం మరిచిపోయారు. చివరకు నాలిక్కరుకుని ఆయన్ను గుర్తు చేసుకుని సభ ముఖంగా సారీ సార్ చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

భరత్ అనే నేను బహిరంగ సభకు విచ్చేసిన అభిమానులంకు ధాంక్స్. మా బేనర్లో ఇంత పెద్ద సినిమా చేసినందుకు దర్శకుడు కొరటాల శివకు జీవితాంతం రుణపడి ఉంటాను. మహేష్ బాబుతో సినిమా చేయాలనేది ఎప్పటి నుండో నా కోరిక. ఆ కోరిక ఇంత మంచి సినిమాతో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మాటలో చెప్పే సినిమా కాదు. ఏప్రిల్ 20న చూసిన తర్వాత ఈ సినిమా ఎంత గొప్పగా ఉందో మీరే చెబుతారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్ కు, ఆర్టిస్టులకు అందరికీ థాంక్స్. ఈ సినిమాకు పని చేశామని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు. మీ అభిమానులందరూ ఈ సినిమా గురించి ఎంత గొప్పగా ఊహిస్తున్నారో ఈ భరత్ అనే నేను అంత కన్న గొప్పగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నాకు ఇంతకంటే ఎక్కువ మాటలు రావడం లేదు. 20వ తర్వాత మీ అందరితో మాట్లాడతాను... అని దానయ్య అన్నారు.

ఇక ఎన్టీఆర్ తన ప్రసంగంలో దానయ్య గురించి మాట్లాడుతూ.... అప్పుడే పొదిగిన గుడ్డులో నుంచి వచ్చిన కోడి పెట్టలా ఉంటారు. ఈ రోజు మాత్రం చెమట పట్టి అలసిపోయినట్లు ఉన్నారు. దానయ్య గారికి ఈ చిత్రం అద్భుతమైన విజయం అందించి ఆయన బేనర్ కు పేరు ప్రఖ్యాతుల తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.

English summary
Watch Producer DVV Danayya Speech Bharat Bahiranga Sabha. The movie Starring : Superstar Mahesh Babu, Kiara Advani, Prakash Raj, Sarath Kumar, Rao Ramesh, Ravi Shankar, Posani Krishna Murali, Aamani, Jeeva, Benarjee, Brahmaji, Ajay Kumar, Sithara, Rajitha, Prithviraj, Devraj, Yashpal Sharma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X