మహేష్ బాబు గురించి అది నిజం కాదు, నాకు అలాంటి ఆశ లేదు: నమ్రత

By Bojja Kumar

'భరత్ అనే నేను' విజయంతో మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ భర్త మొహంలో ఆనందం చూడటంతో నమ్రత కూడా ఈ విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన కెరీర్ గురించి, మహేష్ బాబు గురించి, పిల్లల గురించి ఇలా చాలా విషయాలు నమ్రత ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భరత్ విజయంతో మహేష్ చాలా సంతోషంగా ఉన్నారని, తన కెరీర్ వదులుకున్నందుకు బాధగా లేదని ఇలా పలు విషయాలు ఆమె వెల్లడించారు.

కెరీర్ వదిలి పెట్టుకోవడంపై ఏ మాత్రం బాధ లేదు

కెరీర్ వదిలి పెట్టుకోవడంపై ఏ మాత్రం బాధ లేదు

పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండటంపై ఏ మాత్రం బాధ లేదు. నేను మిగిలిన హీరోయిన్లలా కెరీర్‌ ఓరియెంటెడ్‌గా లేను. నేను సీరియస్‌గా నటించినప్పటికీ డబ్బు, ఫేమ్ కోసం ఎప్పుడూ పరుగెత్తలేదు. వాటిపై నాకు పెద్దగా ఆశ కూడా లేదు అని నమ్రత తెలిపారు. నేను నటించిన ‘వాస్తవ్‌' సినిమా చూసిన జయా బచ్చన్‌ నాకు ఫోన్‌ చేసి ‘ఈ చిత్రంలో నీ నటనకు జాతీయ అవార్డు వస్తుంది' అని ప్రశంసించారు. ఇలాంటివి నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఇంతకు మించిన అవార్డులు, రివార్డులు నేను ఎప్పుడూ కోరుకోలేదు అని నమ్రత తెలిపారు.

సంతోషంగా హైదరాబాద్ షిప్ట్ అయ్యాను

సంతోషంగా హైదరాబాద్ షిప్ట్ అయ్యాను

ముంబై వదలి హైదరాబాద్ రావడానికి ఏ మాత్రం బాధ పడలేదు, ఇబ్బంది పడలేదు. పెళ్లి తర్వాత సంతోషంగా మహేష్‌తో కలిసి ఇక్కడికి వచ్చాను. పెళ్లికి ముందే ముంబైలో చేయాల్సిన పనులు పూర్తి చేసి... మై లవ్ మహేష్ నా సర్వస్వం అనుకుని హైదరాబాద్ వచ్చేశానని, ఎంతో సంతోషంగా తన జీవితం సాగుతోందని నమ్రత తెలిపారు.

సినిమాలు లేకుంటే ఫ్యామిలీతో

సినిమాలు లేకుంటే ఫ్యామిలీతో

మహేష్ పూర్తిగా ఫ్యామిలీ మెన్. షూటింగులు లేనపుడు ఆయన ఇంట్లో నాతో, పిల్లలతో గుడపటానికే ఇష్టపడతారు. సితారతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. తమ కుమారుడు గౌతమ్... తండ్రి మాదిరిగానే కాస్త షై పర్సన్ అని నమ్రత చెప్పుకొచ్చారు.

నేను చెప్పిందే మహేష్ చేస్తాడు అనేది నిజం కాదు

నేను చెప్పిందే మహేష్ చేస్తాడు అనేది నిజం కాదు

‘చాలా మంది నేను చెప్పిందే మహేష్ బాబు చేస్తాడు అని భావిస్తుంటారు. అది నిజం కాదు. ఆయన చూడటానికి జెంటిల్‌గా, షైగా కనిపించొచ్చు. కానీ ఆయనకు ఏం కావాలో బాగా తెలుసు. మనసుకు నచ్చింది చేస్తారు. ఆయన కెరీర్ డెసిషన్స్ అన్నీ సొంతగా తీసుకున్నవే. నా ప్రభావం ఏమాత్రం లేదు. అయితే కథ, స్క్రిప్ట్‌ ఐడియాను మాత్రం నాతో పంచుకుంటాడు. డ్రెస్సింగ్‌ విషయంలో నేను సలహాలు ఇస్తుంటా.. కానీ చివరకు తనకు నచ్చినవే వేసుకుంటారు. ఆయన డ్రెస్సింగ్ ఇతర తెలుగు హీరోల్లా కాకుండా డిఫరెంటుగా కనిపిస్తే మాత్రం అందులో నా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నట్లే... ఈ విషయాన్ని నేను ఒప్పుకోవాల్సిందే అని నమ్రత తెలిపారు.

మహేష్ కెరీర్లోనే పెద్ద హిట్, హ్యాపీగా ఉన్నారు

మహేష్ కెరీర్లోనే పెద్ద హిట్, హ్యాపీగా ఉన్నారు

‘భరత్‌ అనే నేను' ఆయన కెరీర్లోనే పెద్ద విజయం. చాలా ఆనందంగా ఉన్నారు. దీన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కావడం లేదు. గత రెండు చిత్రాలు ప్లాప్ అవ్వడంతో చాలా రోజులుగా ఆయన అభిమానులకు హిట్ ఇవ్వాలనే టెన్షన్లోనే ఉన్నారు. ఎందుకంటే అభిమానుల్ని నిరాశపర్చడం ఆయన‌కు నచ్చదు. వారిపట్లు చాలా బాధ్యతగా ఉంటారు. గత రెండు సినిమాలు విషయంలో అలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ తన ఎంపిక విషయంలో తనను తాను ప్రశ్నించుకునే వారు. ప్రేక్షకులకు ఏం కావాలి అనే ప్రశ్నకు ‘భరత్ అనే నేను' ద్వారా సమాధానం దొరికింది అని నమ్రత తెలిపారు.

మేడమ్ టుస్సాడ్స్‌లో మహేష్ విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్‌లో మహేష్ విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్‌లో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించడంపై నమ్రత స్పందిస్తూ.... దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. దీనిపై నాతో పాటు అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నారని నమ్రత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X