»   » మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఒకరోజు ముందే రచ్చ..

మహేష్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఒకరోజు ముందే రచ్చ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో భరత్‌ అనే నేను రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రాన్ని ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 రెగ్యులర్‌గా షూటింగ్

రెగ్యులర్‌గా షూటింగ్

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ''ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యుయేషన్‌గా పుణెలో షెడ్యూల్‌ ఉంటుంది అని తెలిపారు.

ఏప్రిల్ 26న రిలీజ్

ఏప్రిల్ 26న రిలీజ్

మార్చి 27 వరకు టోటల్‌గా సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా 'భరత్‌ అనే నేను' చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం అని వెల్లడించారు.

కొరటాల శివతో చేయడం

కొరటాల శివతో చేయడం

మహేష్‌గారితో కొరటాల శివ కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బేనర్‌కి ఇది ఓ ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఆడియో టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి అని అన్నారు.

 తెర వెనుక, తెర ముందు

తెర వెనుక, తెర ముందు

సూపర్‌స్టార్‌ మహేష్‌, హీరోయిన్‌ కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Superstar Mahesh Babu is shooting for his next project titled Bharat Ane Nenu. The movie is tipped to be an interesting political drama. Koratala Siva who earlier gave a blockbuster to Mahesh in the form of Srimanthudu is teaming up with the actor for the second time. Movie will hit the screens on April 27th across the globe. DVV Entertainments is producing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu