»   » ఫ్రిన్స్ మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే.. మార్చి 6న భరత్ అను నేను విజన్

ఫ్రిన్స్ మహేష్ ఫ్యాన్స్‌కు పండుగే.. మార్చి 6న భరత్ అను నేను విజన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న భారీ చిత్రం 'భరత్‌ అనే నేను'. అయితే ప్రిన్స్ అభిమానులను సంతోషపరిచే వార్తను నిర్మాతలు తాజాగా షేర్ చేశారు.. ఇంతకు అదేమిటంటే..

మార్చి 6న ది విజన్‌ ఆఫ్‌ భరత్‌

మార్చి 6న ది విజన్‌ ఆఫ్‌ భరత్‌

భరత్‌ అనే నేను చిత్రాన్ని ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి సంబంధించి 'ది విజన్‌ ఆఫ్‌ భరత్‌'ను మార్చి 6న విడుదల చేయనున్నారు.


ఆకట్టుకొన్న ఫస్ట్‌ ఓత్‌

ఆకట్టుకొన్న ఫస్ట్‌ ఓత్‌

జనవరి 26న చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన భరత్ అను నేను 'ఫస్ట్ ఓత్'ను రిలీజ్ చేసింది. సీఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఉణ్న ఆ ఆడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నది.


 ఫస్ట్ ఓథ్ ఇదే..

ఫస్ట్ ఓథ్ ఇదే..

"భరత్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని చెప్పడం ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసింది.


మహేష్‌తో కైరా అద్వాని

మహేష్‌తో కైరా అద్వాని

భరత్ అనే నేను చిత్రంలో సూపర్‌స్టార్‌ మహేష్‌, కైరా అద్వాని, ప్రకాష్‌రాజ్‌, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదలకు సిద్ధమవుతున్నది.


 సాంకేతిక వర్గం..

సాంకేతిక వర్గం..

ఈ చిత్రానికి ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: రవి కె.చంద్రన్‌, ఎస్‌.తిరునవుక్కరసు, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.


English summary
Prince Mahesh Babu's latest movie is Bharat Anu Nenu. This movies first oath got tremoundous response. Mean while, film unit is planning to relase Vision of Bharat on March 20. So get ready Mahesh Fans to rock..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu