»   » భరత్ అనే నేనులో హైలెట్ సీన్స్ అవేనట!.. ఫ్యాన్స్‌ను కేకపెట్టించడం ఖాయమట!

భరత్ అనే నేనులో హైలెట్ సీన్స్ అవేనట!.. ఫ్యాన్స్‌ను కేకపెట్టించడం ఖాయమట!

Posted By: Sreedhar
Subscribe to Filmibeat Telugu

భరత్ అనే నేను భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొరటాల శివ, మహేష్ బాబు కలిసి చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. కైరాఅద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి,

Bharat Ane Nenu First Copy Report Biggest Hit Ever
సాంగ్స్ కు మంచి స్పందన

సాంగ్స్ కు మంచి స్పందన

సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

సినిమాలో హైలెట్ సీన్స్

సినిమాలో హైలెట్ సీన్స్

భరత్ అనే నేను సినిమాలో ప్రధానంగా ధియేటర్ ఫైట్ హైలెట్ కాబోతోందని తెలుస్తోంది. హైదారాబాద్ లోని లింగంపల్లి లో ఒక ధియేటర్ లో ఈ ఫైట్ ను చిత్రీకరించడం జరిగింది. అలాగే మహేష్ ముఖ్య మంత్రి హోదాదాలో ఉన్న సమయంలో జరిగే ఒక అసెంబ్లీ సీన్ సినిమాకు మరో హైలెట్ కాబోతోందని సమాచారం. ఈ ఎపిసోడ్ ను అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించడం జరిగింది.

మహేష్ బాబు కు సోదరిగా యాంకర్

మహేష్ బాబు కు సోదరిగా యాంకర్

ఈ సినిమాలో యాంకర్ కౌముది మహేష్ బాబు సిస్టర్ పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మూవీతో పాటు రవితేజ నేలటికెట్ సినిమాలో ఈ యాంకర్ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. సినిమాల్లో నటిస్తూనే సెలెబ్రిటి ఇంటర్వూస్ చేస్తోంది ఈ యాంకర్.

తరువాతి సినిమాపై మహేష్ ఫోకస్

తరువాతి సినిమాపై మహేష్ ఫోకస్

భరత్ అనే నేను సినిమా విడుదల అయ్యాక ఒక నెల గ్యాప్ తీసుకొని మహేష్ తన నెక్స్ట్ సినిమా పై ఫోకస్ పెట్టబోతున్నాడు. వంశి పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాకు దేవి సంగీతం అందించబోతున్నాడు. ఎక్కువ భాగం సినిమా షూటింగ్ అమెరికా లో జరుపుకోబోతున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

English summary
Bharath ane nenu film coming theaters on April 20. This is second time koratala siva doing film with mahesh babu. mainly two episodes to be highlight in this film. Anchor koumudhi playing important role in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X