»   » ఓ వైపు తమ్ముడి విషాదం... మరో వైపు షూటింగుకు హాజరైన రవితేజ!

ఓ వైపు తమ్ముడి విషాదం... మరో వైపు షూటింగుకు హాజరైన రవితేజ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భరత్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. భరత్‌ను చూడటానికి రవితేజ, కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. విదేశాల్లో ఉన్న భరత్ భార్య కూడా చివరి చూపుకు రాలేదని సమాచారం.

యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి... అటు నుండి అటే స్మశానానికి తీసుకెళ్లి ఖననం చేశారు. రవితేజ మరో సోదరుడు రఘు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కనీసం చివరి చూపుకు కూడా రాక పోవడం వెనక కారణం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


షూటింగుకు హాజరైన రవితేజ

షూటింగుకు హాజరైన రవితేజ

మరో వైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ షూటింగ్‌లో పాల్గొనడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ‘రాజా ది గ్రేట్' చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు.


అన్నపూర్ణ సూడియోలో షూటింగ్

అన్నపూర్ణ సూడియోలో షూటింగ్

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘రాజా ది గ్రేట్' చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఇక్కడ రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.


షాకైన దర్శకుడు

షాకైన దర్శకుడు

రవితేజ తమ్ముడి మరణంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుందని భావించిన దర్శకుడు అనిల్ రావిపూడి....అందుకు సంసిద్ధమయ్యారని, అయితే దర్శకుడికి షాకిస్తూ షూటింగ్ కొనసాగించాలని చెప్పిన రవితేజ... షూట్‌కు హాజరయ్యారట.


విమర్శలు

విమర్శలు

భరత్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సొంత సోదరుడు మరణిస్తే రవితేజ కనీసం చూడటానికి కూడా రాక పోవడం, ఎలాంటి బాధ లేకుండా షూటింగులో పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఇలాంటి చావు ఎవరికీ రావొద్దు

ఇలాంటి చావు ఎవరికీ రావొద్దు

భరత్ లాంటి మరణం ఎవరికీ రావొద్దని, అందరూ ఉండి కూడా ఇలా అనాధలా మరణించే పరిస్థితి ఏమిటని.... టాలీవుడ్లో ఇలాంటి దుస్థితి ఎవరికీ రాలేదని, ఇకపై ఎవరికీ రాకూడదని, మనిషి ఎంత చెడ్డవాడైన చనిపోయిన తర్వాత కూడా దూరం పెట్టడం ధర్మం కాదని అంటున్నారు.English summary
Bharath death: Ravi Teja skips last rites and continued in shooting. Actor Ravi Teja did not attend his brother Bharath's funeral at the Jubilee Hills Mahaprasthanam on Sunday, in spite of being in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu