»   » హీరోయిన్ భావన మీద జరిగిన లైంగిక దాడికి... టీవీ యాడ్‌కు లింకు?

హీరోయిన్ భావన మీద జరిగిన లైంగిక దాడికి... టీవీ యాడ్‌కు లింకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మలయాళ హీరోయిన్ భావన మీద ఇటీవల కొచ్చిలో జరిగిన దాడి సౌత్ సినీ పరిశ్రమను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భావనను ఆమె కారులోనే కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు, అసభ్యంగా ఫోటోలు, వీడియోలు తీసారు. డబ్బు కోసం ఆమె వద్ద గతంలో పని చేసిన డ్రైవరే మరికొందరితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిట్టాడు.

వారి చెర నుండి బయట పడ్డ భావన... ఈ విషయంపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేసింది. ఇది కేవలం డబ్బు కోసం జరిగింది కాదు... దీని వెనక కుట్ర ఉందని నేను భావిస్తున్నాను, తెర వెనక ఉన్న అసలు నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం సాగిస్తాను అంటూ ఇటీవల ప్రెస్ మీట్లో భావన శపథం చేసారు కూడా...

టీ బ్రాండ్ యాడ్ హాట్ టాపిక్

ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భావన నటించిన ఓ టీ బ్రాండ్‌ ప్రకటన చర్చనీయాంశం అయిది. ఈ యాడ్ లో మహిళలు ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కొన్నా దృఢంగా ఉండాలంటూ ఓ డైలాగ్‌ చెప్తుంది భావన. పరోక్షంగా తనకు జరిగిన దాడిని ఇందులో ప్రస్తావించారనే ప్రచారం జరుగుతోంది.

అవసరమా?

అవసరమా?

ఈ యాడ్ గురించి ఇపుడు సోషల్ మీడియాలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాణిజ్య ప్రకటనలో ఆమెకు జరిగిన సంఘటన గురించి పరోక్షంగా ప్రస్తావించడాన్ని కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

వాళ్లే సిగ్గు పడాలి

వాళ్లే సిగ్గు పడాలి

ఇటీవల తనపై జరిగిన దాడిపై భావన స్పందిస్తూ...ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు బయటపెట్టడానికి భయపడకూడదు. తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకూడదు. ఇలాంటివి ఎదురైతే మహిళలు సిగ్గు పడ కూడదు...నేరం చేసినోళ్లే సిగ్గు పడేలా చేయాలి అని భావన చెప్పుకొచ్చారు.

నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను

నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను

నేను ఈ ఘటనపై మౌనం వహించి ఉంటే నలుగురిలో దీని గురించి మాట్లాడలేదనే అపరాధ భావంతో తల ఎత్తుకోలేక పోయేదాన్ని. తప్పు చేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసా, నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతాను అని భావన ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.

English summary
The assault on actress Bhavana is one that shook the entire country. But Bhavana braved the odds and not only did she return to acting with two movies, but also began shooting for her next movie within weeks. Now, in a new TV commercial for a tea brand, she is seen speaking about ‘strength’ and ‘facing the odds’. The ad begins with a narration that translates to this, “As the going gets tough, we begin to realise our inner strength.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu