»   » నిర్మాతతో హీరోయిన్ భావన వివాహం... డేట్ ఫిక్స్ అయింది!

నిర్మాతతో హీరోయిన్ భావన వివాహం... డేట్ ఫిక్స్ అయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ మళయాలం హీరోయిన్ భావన నిశ్చితార్థం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. కన్నడ నిర్మాత నవీన్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న భావన అతడినే పెళ్లాడాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 2017లో వీరి వివాహం జరుగబోతోంది.

ఇటీవల ఇంటర్వ్యూలో అక్టోబర్లో తమ వివాహం జరుగుతుందని భావన వెల్లడించారు. తాజాగా భావన తల్లి పుష్క వివాహ తేదీని ప్రకటించారు. అక్టోబర్ 27న భావన-నవీన్ పెళ్లి జరుగుతుందని తెలిపారు.

భావన సొంతూరులో వేడుక

భావన సొంతూరులో వేడుక

భావన-నవీన్ పెళ్లి వేడుక భావన స్వస్థలమైన తిరుచ్చూరులో జరుగబోతోంది. ఇక్కడి లులు కన్వెన్షన్ సెంటర్ ను వివాహం కోసం బుక్ చేసారు.

సింపుల్ గా పెళ్లి

సింపుల్ గా పెళ్లి

భావన-నవీన్ వివాహం చాలా సింపుల్ గా జరుగబోతోంది. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు.

ఆ చీకటి సంఘటన నుండి ఇప్పుడప్పుడే

ఆ చీకటి సంఘటన నుండి ఇప్పుడప్పుడే

ఇటీవల భావనపై కేరళలో లైంగిక వేధింపులు, దాడి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంగటన నుండి భావన ఇప్పుడిప్పుడే బయట పడుతోంది.

ధైర్యంగా ముందుకు

ధైర్యంగా ముందుకు

తనపై జరిగిన లైంగిక వేధింపులు, దాడి వెనక కుట్ర కోణం ఉందని, దాని వెనక ఉన్న వారికి శిక్ష పడే వరకు ధైర్యంగా పోరాడుతానని భావన స్పష్టం చేసింది.

English summary
Bhavana, the popular actress got engaged to her longtime boyfriend, Kannada producer Naveen, recently. As per the latest reports, it has been confirmed that Bhavana and Naveen will tie the knot in 27th October 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu