»   » వెంకటేష్ కి నప్పదన్నాడనే వద్దనుకున్నాం

వెంకటేష్ కి నప్పదన్నాడనే వద్దనుకున్నాం

Posted By:
Subscribe to Filmibeat Telugu
  Venkatesh
  హైదరాబాద్ : ఈ కథను నా మిత్రుడు, తమిళ దర్శకుడు కవి కాళిదాస్ రాశాడు. మొదట దీన్ని వెంకటేశ్‌కు వినిపించాం. అయితే ఈ సినిమాలో రన్నింగ్, చేజింగ్ సీన్లతో కూడిన యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండటంతో తనకు ఇది నప్పదని ఆయన భావించారు అంటూ దర్శకుడు ఉదయ్ శంకర్ వివరించారు. ఆయన తన తాజా చిత్రం భీమవరం బుల్లోడు విడుదల సందర్బంగా ఇలా స్పందించారు. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ నిర్మించిన 'భీమవరం బుల్లోడు' చిత్రానికి ఆయన దర్శకుడు. సునీల్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


  అదే సమయంలో 'పూలరంగడు' సినిమా వచ్చి, అందులో యాక్షన్ హీరోగానూ సునీల్ మెప్పించడంతో ఆయనకు ఈ పాత్ర బాగుంటుందనే ఉద్దేశంతో కథ వినిపించాం. ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఆయన కథ ఓకే చేశాడు. సినిమా చూశాక రాంబాబు పాత్రలో ఆయనను కాక మరొకర్ని ఊహించుకోలేం. పాటలకి ఆయన తీసుకున్న శ్రద్ధచూసి నాకు ఆశ్చర్యమేసేది. తనంతట తానే రిహార్సల్స్ చేసుకుని, అప్పుడు కెమెరా ముందుకు వచ్చి చేసేవాడు. ఇందులో పాటలన్నీ బాగుంటాయి. ఇవాళ సునీల్ సినిమా అంటే ప్రేక్షకులు ఏం ఆశించి వస్తారో, ఆ అంశాలన్నీ ఉన్న సినిమా ఇది. హీరోయిన్‌గా ఎస్థర్ చాలా బాగా చేసింది. తెలుగు బాగా నేర్చుకుంది. డాన్సులు కూడా బాగా చేసింది.

  ఉదయ్ శంకర్ మాట్లాడుతూ....ఈ సినిమాకి ప్రధానాకర్షణ రాంబాబు క్యారెక్టరైజేషన్, ఆ పాత్రలో సునీల్ నటన. సునీల్ స్వతహాగా భీమవరం నుంచి వచ్చినవాడే కాబట్టి అక్కడి యాసతో బాగా పట్టుంది. అతని డైలాగులు అక్కడి యాసతోనే ఉంటాయి. శ్రీధర్ సీపాన రాసిన ఆ డైలాగుల్ని ఆయన చాలా బాగా చెప్పాడు. ఊళ్లో అమాయకంగా ఉంటే రాంబాబుకు ఏ అమ్మాయైనా నచ్చిందంటే ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందన్న మాటే. దాంతో ఏ అమ్మాయికి పెళ్లి కావాలన్నా, రాంబాబు వద్దకు వచ్చి ఆమె నచ్చిందని చెప్పమని జనం బతిమాలుకుంటూ ఉంటారు. ఆఖరుకి హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది. ఆమె తనకు నచ్చిందని చెప్పిన వెంటనే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. ఇలాంటి గమ్మత్తయిన ఈ పాత్రను ప్రేక్షకులు ప్రేమించకుండా ఉండలేరు అన్నారు.

  నిర్మాత సురేశ్‌గారు అంత త్వరగా కన్విన్స్ కారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చింది. ఆయన ఏ సినిమాకైనా ఓ నిర్మాతలా కాక, ఒక టెక్నీషియన్‌లాగా కష్టపడతారు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర్నుంచి, గుమ్మడికాయ కొట్టేదాకా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆయన పాలు పంచుకున్నారు. సినిమా చూసుకున్నాక ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలిసి ఇది హిందీలో రీమేక్ అయ్యే అవకాశాలున్నాయి. అక్షయ్‌కుమార్‌కు ఈ సినిమా బాగుంటుంది అన్నారు.

  ఈ చిత్రానికి ఆడియో ఇప్పటికే విడుదల చేసామని,మంచి ఆదరణ పొందుతోందనిని నిర్మాత సురేష్‌బాబు తెలిపారు. తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, కథ:కవి కాళిదాస్, మాటలు:శ్రీధర్ శీపన, కెమెరా:సంతోష్‌రాయ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.

  English summary
  Sunil's Bheemavaram Bullodu is readying for release on February 14th. Director Uday Shankar said he prepare the script keeping victory Venkatesh in mind by however he changed the hero in the last minute as the entire second half requires hero to do the chasing. He said Venkatesh was replaced since he didn't want to trouble him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more