For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak OTT: రిలీజ్ డేట్ ప్రకటించిన రెండు ఓటీటీలు.. రికార్డు క్రియేట్ చేయబోతున్న పవన్

  |

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతూ.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన చిత్రాల్లో 'భీమ్లా నాయక్' ఒకటి. అంతలా ఈ మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయం నుంచే అంచనాలను ఏర్పరచుకుంది. అప్పటి నుంచి విడుదలయ్యే వరకూ నిత్యం హైలైట్ అవుతూ వచ్చింది. ఇలా భారీ బజ్‌తో ఫిబ్రవరి 25వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చినా.. ఆ తర్వాత క్రమంగా తగ్గాయి. దీంతో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను చేరుకోవడం కోసం 'భీమ్లా నాయక్' పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

  స్టార్ హీరోల కలయికలో ‘భీమ్లా’

  స్టార్ హీరోల కలయికలో ‘భీమ్లా’

  పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో వచ్చిన మూవీనే ‘భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర రూపొందించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు మాటలు అందించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు.

  క్లోజప్ సెల్ఫీతో రెచ్చిపోయిన ఇలియానా: అబ్బో ఆమెను ఈ ఫోజులో చూస్తే తట్టుకోలేరు

  ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

  ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

  క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాల సమాచారం.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత

  భీమ్లా నాయక్ మూవీ విడుదలైన మూడు వారాలు పూర్తయ్యాయి. ఆరంభ వారంలో 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో వారం మాత్రం 5 కోట్ల రూపాయలను కూడా రాబట్టలేదు. అలాగే, మూడో వారం కూడా కష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. దీంతో మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 97 కోట్లకు పైగా షేర్.. రూ. 158 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.

  భూమిక చావ్లా అందాల విందు: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

  ఇంకెంత వస్తే ఈ సినిమా హిట్

  ఇంకెంత వస్తే ఈ సినిమా హిట్


  బిగ్ మల్టీస్టారర్‌గా ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు వారాల్లో రూ. 97 కోట్లు పైగా వసూలు చేసింది. అంటే మరో రూ. 10 కోట్లు వరకూ ఇది వసూలు చేస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

  ఆ రెండు ఓటీటీలకు హక్కులు

  ఆ రెండు ఓటీటీలకు హక్కులు

  ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో పాటు విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘భీమ్లా నాయక్' హక్కులకు భారీ పోటీ నెలకొంది. దీంతో ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని అన్నారు. ఆ తర్వాత ఆహా సంస్థ కూడా ఈ హక్కులు తీసుకుందని ఓ న్యూస్ లీకైన సంగతి తెలిసిందే.

  బీచ్‌లో తడిచిన బట్టల్లో అమలా పాల్ రచ్చ: అదొక్కటే అడ్డంగా పెట్టుకుని మరీ ఘాటుగా!

  డిజిటల్ స్ట్రీమింగ్‌పై అనౌన్స్

  డిజిటల్ స్ట్రీమింగ్‌పై అనౌన్స్

  ‘భీమ్లా నాయక్' మూవీ విడుదలై నాలుగో వారంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఈ హక్కులు తీసుకున్న ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థలు వేరు వేరుగా ప్రకటనలు విడుదల చేసింది. ఇక, ఈ చిత్రాన్ని మార్చి 25వ తేదీ 12 గంటల నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించాయి.

  Recommended Video

  Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
  పవన్ పేరిట మరో రికార్డు కూడా

  పవన్ పేరిట మరో రికార్డు కూడా


  ఓటీటీల హవా పెరుగుతోన్న కొద్దీ సినిమాలు చాలా త్వరగానే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే, ఇప్పటి వరకూ ఏ సినిమా కూడా ఒకేసారి రెండు ఓటీటీల్లో విడుదల కాలేదు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్' మాత్రమే ఈ ఫీట్‌ను అందుకోబోతుంది. ఫలితంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరబోతుంది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Did Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. This Movie to Stream on Hotstar and Aha From March 25th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X