»   » సీక్రెట్‌గా...మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ భూమిక

సీక్రెట్‌గా...మగ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ భూమిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ 'ఖుషి' చిత్రం ద్వారా పాపులార్ అయిన హీరోయిన్ భూమిక. ఉత్తారిదికి చెందిన ఈ భామ ఆ సినిమా తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది. పలు హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వయసు పైబడటంతో హీరోయిన్ వేషాలు మానేసి ఇతర పాత్రల్లో నటించడంతో పాటు సినిమా నిర్మాతగా కూడా మారింది.

గత కొన్నేళ్ల క్రితమే యోగా గురు భరత్ ఠాకూర్‌ను పెళ్లాడిన భూమిక ప్రస్తుతం తన జీవితంలో ఎన్నడూ లేనంత చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆమె ఇపుడు ఓ మగబిడ్డకు తల్లయింది. ఉన్నట్టుండి ఈ విషయం వినడం ఆశ్చర్యంగానే ఉంది కదూ. కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. రెండు వారాల క్రితమే భూమిక ప్రసవించింది.

గర్భం దాల్చిన విషయంతో పాటు, తల్లయిన విషయాన్ని కూడా ఇంతకాలం సీక్రెట్‌గా ఉంచి భూమిక....ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది. విషయం బయటకు తెలిస్తే మీడియా హడావుడి తట్టుకోవడం కష్టమనే కారణంతోనే భూమిక ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిందని తెలుస్తోంది.

ఏది ఏమైనా....మాతృత్వపు మధురానుభూతిని ఆస్వాదిస్తున్న భూమికకు కంగ్రాట్స్ చెబుదాం. త్వరలో భూమిక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన లడ్డూబాబు చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రానికి రవిబాబు దర్శకత్వం వహించారు.

English summary

 Bhumika Chawla delivers a baby. The latest buzz is that she had delivered a baby two week ago and its a baby boy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu