»   » భూమిక రీ ఎంట్రీ, భర్తతో గొడవలు, నిరాదరణ ప్రధానాంశం

భూమిక రీ ఎంట్రీ, భర్తతో గొడవలు, నిరాదరణ ప్రధానాంశం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ: ఖుషీ చిత్రంలో పవన్ ప్రక్కన చేసి అప్పట్లో కుర్రకారుని ఆకట్టుకున్న భూమిక, ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలో వచ్చినంత పేరు రాలేదు. పెద్ద హీరోల సరసన చేసిన భూమిక, మిస్సమ్మ, మాయా బజార్ వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు సైతం చేసింది. అయితే తర్వాత మెల్లిగా సినిమా రంగంకు బై చెప్పి భరత్ ఠాగూర్ అనే యోగా గురువుని చేసుకుని సెటిల్ అయ్యిపోయింది.

అయితే మళ్లీ ఇంతకాలానికి ఆమె వెండితెరపై మళ్లీ కనిపించటానికి రంగం సిద్దం చేసుకుంది. ఐలవ్ యూ అలియా అనే టైటిల్ తో రూపొందే కన్నడ చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తోంది. సమాజానికి ఓ మంచి సందేశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని, తన రీలాంచింగ్ కు అర్దం ఉంటుందని ఆమె చెప్తోంది.

భూమిక మాట్లాడుతూ...ఐ లవ్ అలియా లో నా పాత్ర అధ్బుతంగా ఉంది. ఇలాంటి పాత్రను నేను ఎప్పుడూ నా కెరీర్ లో చేయలేదు. పాత్రలో చాలా లేయిర్స్ ఉన్నాయి. నేను ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆతృతతో ఎదురుచూస్తున్నాను.

Bhumika Makes a Comeback

ఇక ఈ చిత్రంలో భూమిక చేస్తున్న పాత్ర పేరు భూమి, ఆమె ఓ డాన్స్ టీచర్, తన భర్తతో ఎప్పుడూ గొడవలు పడుతూండే ఓ బిడ్డకు తల్లి. ఆమె తన భర్త చేత నిరాదరింపబడి, విడిపోవాలని కోరుకుంటూంటుంది.

ఈ చిత్రాన్ని ఇంద్రజిత్ లోకేష్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె సరసన రవిచంద్రన్ కనిపించనున్నారు. మిగతా పాత్రల్లో సన్నిలియోన్, చంద్రన్ కుమార్, సంగీత చౌహాన్, షాయాజి షిండే తదితరలు కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. ఐ లవ్ అలియా చిత్రం రెడ్ చెర్రీ ఫిల్మ్స్, మ్యాజిక్ సినిమా మోషన్ పిక్చర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది.

English summary
Bhumika Chawla says she has never played any role like the one in her upcoming film ‘Luv U Alia’, which has a “good message for the society”.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu