»   »  చిన్న హీరోలతో ...పెద్ద హీరోయిన్

చిన్న హీరోలతో ...పెద్ద హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhumika
ఆమె మరెవరో కాదు...ఖుషీ హీరోయిన్ భూమికా చావ్లా . తాజాగా ఆమె నవదీప్ ప్రక్కన బుక్కయి వార్తల్లో నిలిచింది. తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రానుంది. ఇందులో బాలీవుడ్ సెక్స్ బాంబ్ కిమీ శర్మ మరో హీరోయిన్ చేయనుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే చిన్న హీరోలు,అప్ కమింగ్ హీరోలకు ఆమె వరమవుతుందనే విషయం స్పష్టమవుతుంది. మిస్సమ్మ లో శివాజీ,మాయాబజార్ లో రాజా, అనసూయ లో అబ్బాస్, మల్లెపూవు లో మురళీ కృష్ణ,హలో రీమేక్ లో రాజశేఖర్, ఇప్పుడు నవదీప్ హీరోలుగా చేస్తున్నారు. వీరిలో కొద్దో గొప్పో పెద్ద హీరో ఎవరంటే రాజశేఖరే కనపడతారు. అంటే ఆమె కావాలనే ఇలా తన సొంత ఐడెంటిటీ కోసం చేస్తోందా లేక అవకాశాలు సన్నగిల్లా అనేది ఎవరకీ అర్ధం కావటం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో అయితే ఈ తరహా ఎంపిక కామనే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X