»   » బిచ్చగాడు దెబ్బ మామూలుగా లేదు.... బాహుబలి రికార్డు బద్దలు కొట్టాడు....

బిచ్చగాడు దెబ్బ మామూలుగా లేదు.... బాహుబలి రికార్డు బద్దలు కొట్టాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక్కోసారి అద్భుతాలు జరుగుతుంటాయి! తాజాగా, టాలీవుడ్‌లో అలాంటి అద్భుతమే 'బిచ్చగాడు' సాధించింది. 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు తెలీనే తెలీదు. ఇక, దర్శకుడు గురించి తెలుగు ప్రేక్షకుల సంగతి ప్రక్కన పెడితే.. కనీసం తెలుగు పరిశ్రమ వర్గాలకి కూడా పెద్దగా తెలీదు. ఇక, నిర్మాత కూడా పెద్ద పేరున్న నిర్మాత కాదు. ఇలా, ప్రేక్షకుల దృష్టిలోంచి చూస్తే.. పెద్దగా ఊరు.. పేరు తెలియని వ్యక్తుల నుంచి.. ఏ బ్రాండ్‌ లేకుండా రిలీజైన 'బిచ్చగాడు' టాలీవుడ్‌ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

బాహుబలి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి చరిత్ర సృష్టించగా బుల్లితెర పై కూడా ప్రసారం అయి టిఆర్ పీ రేటింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది బాహుబలి , అయితే ఆ రికార్డ్ ని బద్దలు కొట్టాడు బిచ్చగాడు అలియాస్ పిచ్చయి కారన్ . తెలుగులో సంచలన విజయం సాధించిన బిచ్చగాడు చిత్రానికి తమిళ మాతృక ఈ పిచ్చయికారన్ అన్న విషయం తెలిసిందే .


కాగా ఇటీవలే తమిళంలో విజయ్ ఆంటోనీ నటించిన పిచ్చయి కారన్ టివి లో టెలికాస్ట్ అయ్యింది . విజయ్ ఆంటోనీ సినిమా ప్రసారం కాకుముందు వరకు బాహుబలి నెంబర్ వన్ గా ఉండేది కానీ పిచ్చయి కారన్ టెలికాస్ట్ అయ్యాక బాహుబలి రికార్డులు బద్దలు అయ్యాయి దాంతో బాహుబలి వెనక్కి పోగా నెంబర్ వన్ గా విజయ్ నటించిన పిచ్చయి కారన్ నిలిచింది .


Bichagadu beats TRP of Sardar Baahubali

బాహుబలి సినిమా సృష్టించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, ఆ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది ఈ ఏడాది విడుదలైన 'బిచ్చగాడు'. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందిస్తున్నారు..


ఈ సినిమా దర్శకనిర్మాతలు. అయితే, ఈ సినిమా ఇటీవల బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారం అయిన సినిమాల్లో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన చిత్రం బాహుబలి. ఆ రికార్డును బద్దలు కొట్టాడు బిచ్చగాడు. ఈ సినిమా తమిళ వెర్షన్ 'పిచ్చయికారన్' ఇటీవల బుల్లితెరపై ప్రసారం అయింది. ఈ సినిమా టీఆర్‌పీ బాహుబలి టీఆర్‌పీని మించి పోయింది. దీంతో బుల్లితెరపై అత్యధిక టీఆర్‌పీ రేటింగ్ సాధించిన సినిమా బాహుబలిని వెనక్కి నెట్టి బిచ్చగాడు తొలి స్థానంలో నిలిచిందన్నమాట.

English summary
Bichagadu starring Vijay Antony and Satna Titus has beaten the TRP of Bahubali.in tamil version
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu