»   » శోభన్ బాబు విగ్రహం కూల్చి వేత రగడ.... (ఫోటోస్)

శోభన్ బాబు విగ్రహం కూల్చి వేత రగడ.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని అతివాద తమిళ సంఘాలకు చెందిన కార్యకర్తలు తెలుగు నటుడు శోభన్ బాబు విగ్రహం కూల్చివేతకు ప్రయత్నించడం చెన్నైలో ఉద్రిక్తతకు దారి తీసింది. విగ్రహాన్ని కూల్చివేతకు ప్రయత్నించిన ‘పోగ్రెసివ్ ఫోర్స్ తమిళ్' చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎల్టీటీఈ అధినేత, దివంగత వేలుపిళ్లై ప్రభాకరన్ విగ్రహా ఏర్పాటును కోర్టు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో ఈ చర్యకు పూనుకున్నారు. ప్రభాకరన్‌పై దేశవ్యాప్తంగా నిషేధం ఉన్నందున్న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హీరో శోభన్‌బాబు విగ్రహాన్ని తమిళనాడులో ఏలా ప్రతిష్ఠిస్తారని తమిళ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. భాషా, ప్రాంతీయ భేదాలు కళాకారులకు ఆపాదించవద్దని తెలుగు సంఘాల కార్యకర్తలు స్పష్టం చేశారు.

ఈ సంఘటన నేపథ్యంలో శోభన్ బాబు కుటుంబ సభ్యులకు తమిళనాడుకు చెందిన తెలుగు తెలుగు సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ మేరకు తమిళనాడు తెలుగు యువ శక్తి సంస్థ వారు ప్రెస్ నోట్ విడుదల చేసారు.

స్లైడ్ షోలో ఫోటోలు.

శోభన్ బాబు విగ్రహం

శోభన్ బాబు విగ్రహం


తమిళనాడులోని శోభన్ బాబు విగ్రహం.

శోభన్ బాబు విగ్రహం

శోభన్ బాబు విగ్రహం


తమిళనాడులోని శోభన్ బాబు విగ్రహం.

పోలీసుల భద్రత

పోలీసుల భద్రత


విగ్రహవ వద్ద ఏర్పాటు చేసిన పోలీసుల భద్రత

తెలుగు సంఘాల నేతలు

తెలుగు సంఘాల నేతలు


తమిళ నాడు తెలుగు యువ శక్తి సంఘం నేతలు.

పెస్ నోట్

పెస్ నోట్


శోభన్ బాబు కుటుంబ సభ్యులకు సంఘీబావం తెలుపుతూ విడుదల చేసిన ప్రెస్ నోట్.

మద్దతుగా..

మద్దతుగా..


ఇలాంటి సంఘటనలు మళ్లీ చోటు చేసుకోకుండా తమ వంతు ప్రయత్నం చేస్తామని నేతలె తెలిపారు.

English summary
Tamil Nadu police on Monday arrested a group of people belonging to a newly-formed organisation, Progressive Force of Tamil before they could demolish the statue of Telugu actor late Shoban Babu at centrally-located Mehata Nagar.
Please Wait while comments are loading...