»   » చిరంజీవి పుట్టిరోజు వేడుకలకు అమితాబ్, అమీర్ ఖాన్!

చిరంజీవి పుట్టిరోజు వేడుకలకు అమితాబ్, అమీర్ ఖాన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ రేపు సాయంత్రం (ఆగస్టు 21) జరిగే చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. షష్ఠి పూర్తి(60వ) జన్మదిన వేడుక కావడంతో సెలబ్రేషన్స్ ప్రత్యేకంగా నిర్వహించాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. శనివారం అర్థరాత్రి హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో లావిష్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసారిని, ఈ వేడుకు పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

బర్త్ డే పార్టీ ఇన్విటేషన్ ఇప్పటికే అమితాబ్, అమీర్ ఖాన్ లకు చేరినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ పార్టీకి హాజరవుతామని కన్ ఫర్మ్ చేసినట్లు రామ్ చరణ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబై నుండి వస్తున్న వీరిని రామ్ చరణ్ స్వయంగా రిసీవ్ చేసుకోబోతున్నారు.

Big B, Aamir Khan To Attend Chiranjeevi's Birthday Celebrations

బచ్చన్ ఫ్యామిలీకి చిరంజీవి చాలా క్లోజ్. 60వ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్వయంగా వెళ్లి అమితాబ్ బచ్చన్ ను ఇన్వైట్ చేసినట్లు సమాచారం. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారని, పార్టీలో తాను తప్పకుండా పాల్గొంటానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు గత వారం రోజుల నుండి చిరంజీవి 60వ జన్మదిన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ శనివారం సాయంత్రం జరిగే పార్టీకి సన్నద్ధం అవుతున్నారు.

టాలీవుడ్ నుండి వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు తదితరులు ఈ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం.

English summary
Bollywood stars Amitabh Bachchan and Aamir Khan will most likely attend megastar Chiranjeevi's 60th birthday on Saturday. Big B and Aamir are expected to attend a lavish party that Ram Charan will be hosting for his father in Hyderabad on Saturday in a plush hotel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu